సంఘమునకు సంభంధించిన ప్రశ్నలు
ప్రశ్న: సంఘము అంటే ఏంటి?
సమాధానము:
నేటి ప్రజలు చాల మంది "సంఘము" అనగానే ఒక భవనము అనుకుంటారు.ఇది సంఘము గురుంచి బైబిలు పరంగా అవగాహనకాదు. సంఘము అనే పదము గ్రీకు మాటయైన "ఎక్క్లీసియ" అనగా "బయటకు పిలువ బడిన వారు" లేక "ఒక సమూహము." సంఘము అనే మూలపదమునకు అర్థము ఒక భవననిర్మాణము కాదు, గాని ప్రజలు. ఎవరినైన మీరు వక్రోక్తిగా ఏ సంఘమునకు వెళ్తారు అని అనగానే వారు ఒక భవన నిర్మాణంతో దానిని గుర్తిస్తారు. రోమా 16:5 లో "...వారి ఇంట ఉన్న సంఘమునకును వందనములు చెప్పుడి." పౌలు ఇంట నున్న సంఘమును గురించి సూచిస్తున్నాడు- సంఘ అంటే భవనము కాదు , గాని విశ్వాసుల శరీరముగా కూడే కలయిక.
సంఘము అనేది క్రీస్తుయొక్క శరీరము, ఆయనే శిరస్సై యున్నాడు. ఎఫెసీ పత్రిక 1:22-23లో, " మరియు సమస్తము ఆయన పాదముల క్రింద వుంచి, సమస్తముపైని ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించెను. ఆ సంఘము ఆయన శరీరము: సమస్తమును పూర్తిగా నింపుచున్న వాని సంపూర్ణతయై యున్నది." క్రీస్తుయేసునందు విశ్వాసముంచిన వారందరితో పెంతెకోస్తు దినము మొదలుకొని (అపోస్తలుల కార్యములు 2) మరల క్రీస్తు రెండవ రాకడవరకు. క్రీస్తు శరీరము అనేది రెండు స్థితులతో ఇమిడివుంది.
1). సార్వత్రిక సంఘములో ఎవరైతే యేసుక్రీస్తుతో వ్యక్తిగత సంభంధమును కలిగియుంటారో వారే వుంటారు. "ఏలగనగా యూదులమైనను, గ్రీసుదేశస్థులమైనను, దాసులమైనను, స్వతంత్రులమైనను, మనమందరము ఒక్క శరీరములోనికి ఒక్క ఆత్మయందే బాప్తీస్మముపొందితిమి. మనమందరము ఒక్క ఆత్మను పానముచేసిన వారమైతిమి(1 కొరింథీయులకు 12:13)." ఈ వచనము ఏమిచెప్తుందంటే ఎవరైన ఆయనయందు విశ్వాసముంచినట్లయితే వారు క్రీస్తు శరీరములోని అవయవమై యున్నారు మరియు వారికి క్రీస్తు ఆత్మ ఋజువుగా అనుగ్రహించబడింది. దేవుని యొక్క సార్వత్రిక సంఘములో అందరు యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసముంచి రక్షణతో వ్యక్తిగత సంభంధమును కలిగియున్నవారే.
2).స్థానిక సంఘము అంటే ఈ విధంగా గలతీ పత్రిక 1:1-2 లో వివరించబడింది: " దేవునివలన అపోస్తలుడుగా నియమింపబడిన పౌలను నేనును, నాతోకూడనున్న సహోదరులందరును, గలతీయలోనున్న సంఘమునకు శుభమని చెప్పి వ్రాయునది." ఇక్కడ మనుము చూచినట్లయితే గలతియ ప్రంతములో అనేక సంఘ్ముల్న్నవి. వాటిని మనము స్థానిక సంఘములు అని పిలుస్తాము. బాప్టిస్ట్ సంఘము, లూధరన్ సంఘము, కధోలిక్ సంఘము మొదలగునవి., ఇవి సంఘము కాదు, సార్వత్రిక సంఘము అన్నట్లు - గాని ఇవి స్థానిక సంఘములు, స్థానికంగా ఉన్న విశ్వాసుల గుంపు మాత్రమే. దేవుని యొక్క సార్వత్రిక సంఘములో ఎవరైతే రక్షణకొరకు యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసముంచి వ్యక్తిగత వారే వుంటారు. ఈ సార్వత్రిక సంఘములోని సభ్యులు ఒకరితో నొకరు సహవసించుటకుగాను మరియు ఆత్మీయ అభివృధ్దికొరకై ఖచ్చితముగా వెదకవలెను.
సారాంశములో సంఘము అనేది ఒక భవనము కాదు లేక తెగ కాదు. బైబిలు ప్రకారము, సంఘము అనేది క్రిస్తు శరీరము- ఎవరైతే రక్షణకొరకు యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసముంచినరో వారు వుంటారు(యోహాను3:16; 1 కొరింథీయులకు 12:13). సార్వత్రిక సంఘములోని సభ్యుల కూడుకలే స్థానిక సంఘములు అనేవి. స్థానిక సంఘములోని సభ్యులు సార్వత్రిక సంఘములోని శరీరమునకు తగిన మూలసూత్రములన్ని 1 కొరింథీ పత్రికలోని 12 అధ్యాయములోనివి అన్ని అన్వయించబడతాయి: ప్రోత్సాహించుట, భోధించుట, ప్రభువైన క్రీస్తునందు ఙ్ఞానములోను మరియు కృపలోను ఒకరినొకరు అభివృధ్దికై జీవితములు కట్టుటను గురించి అన్వయించబడుతుంది.
ప్రశ్న: చర్చికి హాజరు అవుట ఎందుకు ప్రాముఖ్యమైంది?
సమాధానము:
బైబిలు చెప్తుంది మనము తప్పక చర్చికి హాజరుఅవ్వాలి ఎందుకంటే ఇతర విశ్వాసులతో కలిసి దేవునిని ఆరాధించటానికి మరియు ఆత్మీయ ఎదుగుదలకొరకు మనము వాక్యముచే భోధింపబడటానికి (అపోస్తలుల కార్యములు 2:42; హెబ్రీయులకు 10:25). సంఘం అనే ప్రదేశములో విశ్వాసులందరు ఒకరినొకరు ప్రేమించుటకు అవకాశం కల్పించేది (1 యోహాను 4:12),ఒకరినొకరు ప్రోత్సాహించుటకు (హెబ్రీయులకు 3:13), ఒకరినొకరు "బుద్దిచెప్పుకొనుటలో " (హెబ్రీయులకు 10:24),ఒకరినొకరు సేవించుటలో (గలతీ5:13), ఒకరినొకరు పురికొల్పుకొనుటకు (రోమా 15:14),ఒకరినొకరు గౌరవించుకొనుటలో (రోమా12:10), మరియు ఒకనిపట్ల ఒకడు దయకలిగి కరుణా హృదయులైయుండుడి (ఎఫెసీ 4:32).
ఒక వ్యక్తి తన్ను రక్షించబడుటకు యేసునందు నమ్మికయుంచినట్లయితే, అతడు లేక ఆమే క్రీస్తు శరీరములోని సభ్యుడుగా అవుతారు (1కొరింథీయులకు 12:27). క్రీస్తు శరిరము సరిగ్గా పనిచేయవలెనంటే అందులో అన్ని అవయవాలు సరిగ్గావుండవలెను (1కొరింథీయులకు 12:42). ఆ విధముగానే , ఒక విశ్వాసి ఆత్మీయ పరిపక్వతలో సంపూర్తిగా ఎన్నడూ చేరలేడు ఇతర విశ్వాసుల ప్రోత్సాహము లేకుండా((1కొరింథీయులకు 21:26). ఈ కారణాలు బట్టి, చర్చికి హాజరవ్వటం, పాల్గొనటం, మరియు సహవసించుట అనేవి విశ్వాసుల జీవితాలలో క్రమముగా జరిగే పక్రియలు. ఒక వ్యక్తి విశ్వాసిఅవ్వటానికి ప్రతీ వారము చర్చికి హాజరవ్వటం అనేది ఏ మాత్రం ఉపయోగంలేనిది, అయితే ఒక వ్యక్తి క్రీస్తుకు సంభంధించినట్లయితే దేవుని ఆరాధించడానికి ఆశించాలి, వాక్యం స్వీకరించాలి మరియు తోటి విశ్వాసులతో సహవాసం చేయటం.
ప్రశ్న: సంఘము ఉద్డేశ్యము ఏంటి?
సమాధానము:
అపోస్తలుల కార్యము 2:42 సంఘము యొక్క ఉద్డేశ్య ప్రమాణమైయుండాలి: "వీరు అపోస్తలుల భోధయందును, సహవాసమందును, రొట్టె విరుచుటయందును ప్రార్థన చేయుటయందును ఎడతెగకయుండిరి." ఈ వచనము ప్రకారము ఉద్దేశ్యము/ సంఘము చేతపట్టవల్సిన కార్యక్రమములు 1) బైబిలు సిధ్దాంతములు భోధించుటయందును, 2). విశ్వాసులు కూడుకొనుటకు కావల్సిన స్థలము అనుగ్రహించడం,3). ప్రభ్బురాత్రి భోజనసంస్కారమును ఆచరించుట యందు, మరియు 4). ప్రార్థన.
సంఘము బైబిలు సిధ్దాంతము లు భోధించుటచేత మనము విశ్వాసములో చక్కగా స్థాపించబడతాము. ఎఫెసీయులకు 4:14 ఈ విధంగా ఛెప్తుంది, " అందువలన మనమిక మీదట పసిపిల్లలమై యుండి, మనుష్యుల మాయోపాయములచేత వంచనతోను, తప్పుమార్గమునకు లాగు కుయుక్తితోను, గాలికి కొట్టుకొనిపోవునట్లును, కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొనిపోవుచు అలలచేత ఎగురగొట్టబడినవారమైన్ట్లుండక." సంఘము అనేది సహవసముగా కూడుకొనుటకు, మరియు క్రైస్తవులు ఒకనియందొకరు అనురాగము గలవారై, ఘనతవిషయములో ఒకనినొకడు గొప్పగా యెంచుకొనుడి (రోమా 12:10), బుద్దిచెప్పుకొనుటలో (రోమా 15:14), ఒకని నొకడు దయకలిగి కరుణాహృదయులై ( ఎఫెసీ 4:32), ఒకనికి ఒకడు క్షేమాభివృధ్దికి ప్రోత్సాహించుకొంటు (1 థెస్సలోనీయులకు 5:11), మరి ముఖ్యముగా ఒకరినొకరు ప్రేమించుటలో (1 యోహాను 3:11).
సంఘము అనేది విశ్వాసులు కూడుకొని ప్రభురాత్రి భోజనమును ఆచరించుటను, క్రీస్తు మనపక్షమున కార్చిన రక్తాన్ని, మరణమును ఙ్ఞాపకముచేసికొనుటకు నిర్ణయించబడింది ( 1 కొరింథీ 11:23-26). "రొట్టెవిరచుట" అనే తలంపు (అపోస్తలుల కార్యములు 2:42) సమాజముగా కలిసి భుజించుట అనే అర్థాన్నిస్తుంది. సహవాసాన్ని అభివృధ్దిపొందించుటకు ఇది మరొక ఉదాహరణ. అపోస్తలుల కార్యములు 2:42 ప్రకారము అంతిమ ఉద్దేశ్యము ఏంటంటే ప్రార్థన. సంఘము అనేచోట ప్రార్థనను ప్రోతాహించేదిగా, ప్రార్థన గురించి భోధించేదిగా, మరియు అవలంభించేదిగా వుండాలి. ఫిలిప్పీయులకు 4:6-7 " దేనిని గూర్చియైనను చింతపడకుడిగాని ప్రతి విషయములోను ప్రార్థన విఙ్ఞాపనములచేత కృతఙ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. అప్పుడు సమస్త ఙ్ఞానమునకు మించిన దేవుని సమాధానను యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును."
మరొక ఆఙ్ఞ సంఘాన్నికి ఇవ్వబడింది యేసు క్రీస్తు ద్వారా అనుగ్రహించబడే రక్షణను సువార్తను గురించి ప్రకటించాలి (మత్తయి 28:18-20; అపోస్తలులకార్యములు 1:8). మాట మరియు క్రియలు ద్వారా సువార్తను ప్రకటిస్తూ నమ్మకముగా వుండాలని సంఘమును దేవుడు పిలిచెను. సంఘము సమాజానికి వెలుగునిచ్చే దీపస్థంభముగాను, ప్రభువును మరియు రక్షకుడైన యేసుక్రీస్తు వైపు వ్యక్తులను నడిపించుటకును తోడ్పడాలి. సంఘము సువార్తను తీసుకొనివెళ్ళి సభ్యులను సువార్తను ప్రకటించేవారిగా తయారుచేయవలెను (1 పేతురు 3:15).
యాకోబు 1:27 లొ సంఘము యొక్క అంతిమ ఉధ్దేశ్యము ఇవ్వబడింది: తండ్రియైన దేవుని యెదుట పవిత్రమును నిష్కళంకమునునైన భక్తి యేదనగా- దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందిలో పరామర్శించుటయు, ఇహలోకమాలిన్యము తనకంటకుండ కాపాడుకొనుటయునే." సంఘము చేసే వ్యాపారము ఏంటంటే నిస్సహాయతలోనున్న వారికి సేవచేయడమే. ఇది కేవలము సువార్తనుగూర్చిన సత్యాలను పంచుకొనుటయే కాదు గాని, శారిరక అవసరతలు లాంటివి ( ఆహారము, వస్త్రములు, ఆశ్రయం) అవి అవశ్యకము మరియు తగినవి. సంఘము క్రీస్తునందు విశ్వాసులను పాపమును అధిగమించుటకు గాను వారికి కావల్సిన పరికరములను మరియు వారు ప్రపంచపు కాలుష్యమునుండి స్వతంత్రులుగానుండునట్లు తర్ఫీదుచేయవలెను. ఇది బైబిలు భోధించుట ద్వారా మరియు క్రైస్తవ సహవాసము వలననే జరుగును.
అయితే సంఘము యొక్క ఉద్డేశ్యము ఏంటి? పౌలు కొరింథులోనున్న విశ్వాసుల గురించి ఒక గొప్ప ఉదాహరణ ఇచ్చెను. సంఘము అనేది దేవుని చేతులు, నోరు మరియు పాదములు ఈ లోకములోనివి- క్రీస్తు శరీరము ( 1 కొరింథీయులకు 12:12-27). యేసు క్రీస్తు శారీరకంగా ఈ లోకములోనుండి పనులు చేస్తున్నట్లయితే మనమును అవే పనులు చేస్తూ వుండే వాళ్ళం. సంఘము అనేది "క్రైస్తవునిగా, " క్రీస్తును పోలి," మరియు "క్రీస్తును వెంబడిస్తూ" వుండాలి.
ప్రశ్న: క్రైస్తవ బాప్తిస్మము ప్రాముఖ్యత ఏంటి?
సమాధానము:
ఒక విశ్వాసి అంతరంగిక జీవితములో జరిగిన వాస్తవతకు బహిర్గత సాక్ష్యమే క్రైస్తవ బాప్తిస్మము అని బైబిలు చెప్పుతుంది. ఒక విశ్వాసి క్రీస్తు ద్వార మరణములో, సమాధిలో మరియు పునరుత్థానములో ఐక్యమగుటకు సాదృశ్యమే క్రైస్తవ బాప్తిస్మము. "క్రీస్తు యేసులోనికి బాప్తిస్మము పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిస్మము పొందితిమని మీరెరుగరా? కాబట్టి తండ్రి మహిమవలన క్రీస్తు మృతులలోనుండి యేలాగు లేపబడెనో, ఆలాగే మనమును నూతన జీవము పొందినవారమై నడుచుకొనునట్లు, మనము బాప్తిస్మమువలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడ పాతి పెట్టబడితిమి " (రోమా 6:3-4) అని బైబిలు ప్రకటిస్తుంది. నీటిలో ముంచబడుట అనే ప్రక్రియ క్రీస్తు మరణము, సమాధికి సాదృశ్యముగా నున్నది. అదే విధంగా నీటిలోనుండి బయటకు రావటం క్రీస్తు పునరుత్థానమునకు సాదృశ్యముగానున్నది.
క్రైస్తవ బాప్తిస్మములో ఒక వ్యక్తి కనీసము రెండు అవసరతలు నెరెవేర్చాలి. 1). ఆ వ్యక్తి యేసుక్రీస్తుని రక్షకుడుగా నమ్మియుండాలి. 2). బాప్తిస్మము దేనిని సూచిస్తుందో దానిని బాగుగా ఎరిగియుండాలి. ఓ వ్యక్తి ప్రభువైన యేసుక్రీస్తుని రక్షకుడుగా అంగీకరించి, బాప్తిస్మము అనేది క్రీస్తునందున్న విశ్వాసి అని బహిర్గతం చేయమన్న ఆఙ్ఞ అని గ్రహించి బాప్తిస్మము పొందుటకు ఆశపడినట్లయితే ఆవ్యక్తి బాప్తిస్మము పొందకుండాల్సిన అవసరతలేదు. బైబిలు ప్రకారము క్రైస్తవ బాప్తిస్మము ప్రాముఖ్యమైంది, ఎందుకంటే- క్రీస్తునందున్న విశ్వాసాన్ని, నమ్మకత్వాన్ని బాహాటముగా ప్రకటించాలన్న ఆఙ్ఞకు విధేయత. మరియు క్రీస్తు మరణము, సమాధి, పునరుత్థానములకు గుర్తింపు.
ప్రశ్న: ప్రభు రాత్రి భోజనసంస్కారము, క్రైస్తవ ఐకమత్యము యొక్క ప్రాముఖ్యత ఏంటీ?
సమాధానము:
ప్రభు రాత్రి భోజనసంస్కారమును అధ్యయనము చేయుట అనేది, అందులోనున్న, లోతైన అర్థం బట్టి హృదయాన్ని కదిలించే అనుభవంగా వుంది. ఇది పస్కా పండుగ, యేసుప్రభువు మరణమునకు ముందు ఆచారించే పురాతన మహోత్సవము, ఈనాటి దినాలలో ఆచరించే భావగర్భితమైన క్రొత్తసహవాసపు భోజనమువంటిది. క్రైస్తవ ఆరాధనకు ఇది ముఖ్యమైన భాఅగము. ఇది ప్రభువు మరనము ఆయన మహిమగల రెండవరాకడకు ఎదురు చూచుటకు కారణమైంది.
పస్కాపండుగ యూదులమత సంవత్సారాలలో అతి పవిత్రమైన ఉత్సవము. ఇది ఐగుప్తులో అంతిమ తెగులైన ఐగుప్తీయుల తొలిపిల్లలు మరణించుట మరియు వారు ఇశ్రయేలీయుల గొఱ్ఱెపిల్ల రక్తాన్ని వధించి, తెగులు వారిని నశింపచేయక దాటింపబడ్డారు. ఎందుకంటే గొఱ్ఱెపిల్ల రక్తము ఇండ్ల ద్వారభంధపై రెండు నిలువ కమ్మీలమీదనుపైన విమోచన రక్తమును చల్లుట వలన అగ్నిచేత కాల్చబడిన ఆ మాంసమును పొంగని రొట్టెలను తిన్నారు. దేవుని అఙ్ఞ ఏంటంటే మీరు యెహోవాకు పండుగగా దాని నాచరింపవలెను. తరతరాలకు నిత్యమైన కట్టడగా దాని నాచరింపవలెను. ఈ కధా నిర్గమకాండము 12లో వివరించబడింది.
ప్రభు రాత్రి భోజనము- పస్కాపండుగ- క్రీస్తు ఆ రొట్టెను పట్టుకొని కృతఙ్ఞతాస్తుతులు చెల్లించిన పిమ్మట దాని విరిచి, ఆయన శిష్యులకిచ్చి వారితో చెప్పెను, " పిమ్మట ఆయన యొక రొట్టెను పట్టుకొని కృతఙ్ఞతాస్తుతులు చెల్లించిన దాని విరిచి,వారికిచ్చి-ఇది మీకొరకు ఇయ్యబడుచున్న నా శరీరము: నన్ను ఙ్ఞాపకము చేసికొనుటకు దీనిని చేయుడని చెప్పెను. ఆప్రకారమే భోజనమైన తరువాత ఆయన గిన్నెయు పట్టుకొని- ఈ గిన్నె మీకొరకు చిందింపబడుచున్న నా రక్తమువలన నైన క్రొత్తనిబంధన" (లూకా 22:19-21). ఆతర్వాత ఒక పాటనుపాడి ఆపండుగను ముగించెను (మత్తయి 26:30, మరియు ఆరాత్రియందే వారు ఒలీవలకొండకు వెళ్ళెను. అక్కడే ముందుగా సూచింపబడినరీతిగా యేసు యూదా చేత శత్రువులకు అప్పగింపబడ్డాడు. ఆ తరువాత దినమే యేసు సిలువవేయబడినారు.
ప్రభురాత్రిభోజనమును గూర్చిన వ్రాతలు సువార్తలలోనున్నవి (మత్తయి 26:26-29; మార్కు 14:17-25; లూకా 22:7-22; మరియు యోహాను 13:21-30). అపోస్తలుడైన పౌలు ఆప్రభురాత్రి భోజముగురించి 1కొరింథీ 11:23-29 లో రాశాడు. పౌలు సంఘటించిన ఒక వాఙ్ఞ్మూలము సువార్తలలో దొరకలేదు, "కాబట్టి యెవడు అయోగ్యముగా ప్రభువుయొక్క రొట్టెను తినునో, లేక ఆయన పాత్రలోనిది త్రాగునో, వాడు ప్రభువుయొక్క శరీరమును గూర్చియు, రక్తమును గూర్చియు అపరాధియగును. కాబట్టి ప్రతీ మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను: ఆలాగు చేసి ఆరొట్టెను తిని, ఆపాత్రలోనిది త్రాగవలెను. ప్రభువు శరీరమని వివేచింపక, తిని త్రాగువాడు తనకు శిక్షావిధికలుగుటకే తిని త్రాగుచున్నాడు (1కొరింథీ 11:27-29). మనము ఈవిధంగా అడగవచ్చు. రొట్టె ద్రాక్షారసము పాల్గొనుట అంటే నాకేమవుతుంది అని , "అయోగ్యమైన పద్దతిలో. ఆరీతిగా ప్రశ్నించినట్లయితే ఆ రొట్టెకు ద్రాక్షారసమునకున్నా లోతైన అంతర్థాన్నాన్ని అవమానించినట్లే. మరియు మన రక్షణకు చెల్లించిన అమూల్యమైన విలువను మరచినట్లే. లేక దానికి ఒక మృతులకు జరిగించే తద్దినపు భోజనముగా మరియు సామాన్య ఆచారముగా లేక పాపపు ఒప్పుదల లేమి మనస్సుతో దేవునికిప్రభురాత్రి భోజనము నాచరించటాన్నికి వచ్చినట్లౌతుంది. పౌలు ఇచ్చిన నియమాలు ఙ్ఞప్తికి తెచ్చుకొని, మనము ప్రభురాత్రి రొట్టెను తినుట, ద్రాక్షరసము పానముచేయుటకు ముందు మనలను స్వపరీక్ష చేసుకొనవలెను.
మరొకసారి పౌలు చేర్చిన ప్రతిపాదన సువార్తలలో సంఘటించలేదు, " మీరు ఈ రొట్టెను తిని, ఈ పాత్రలోనిది త్రాగునప్పుడెల్ల ప్రభువు వచ్చువరకు ఆయన మరణమును ప్రచురించుదురు" ( 1 కొరింథీయులకు 11:26). ఈ వచనములో జరిగే ఈ పండుగకు సమయనికి సరిహద్దు నివ్వబడింది. - ప్రభువు వచ్చేంతవరకు. ఈ క్జొద్ది సంక్షిప్త రాతలనుండి మనము యేసు ఏ విధంగా ఈ చపలమైన మూలవస్తువులను ఆయన శరీరానికి మరియు రక్తానికి గురుతులుగా తీసుకున్నాడో నేర్చుకొనవచ్చు. మరియు అది తన మరణానికి ఙ్ఞాపకానికి గురుతులుగా మొదలు పెట్టాడు. ఇది రాతి పైన గాని ఇనుముపైనగాని చెక్కబడిన స్మారక చిహ్న స్థంభాలుగా కాకుండా, రొట్టె ద్రాక్షారసములు గురుతులుగ వున్నాయి.
మరియు ఆయన బహిర్గంగా రొట్టె విరచిబడినట్లు తన శరీరము నలుగగొట్టబడెను గాని ఒక ఎముకయైనను విరుగగొట్టబడలేదు, దాని శరీరమంతయు హింసనొందిభాధింప బడినవాడాయెను. గురుతు పట్టలేని నిరుపియాయెను (కీర్తనలు 22:12-17; యెషయా 53:4-7).ద్రాక్షారసము ఆయన రక్తాన్ని అది తన అతి క్రూరముగా అనుభవించబోయే మరణాన్ని సూచిస్తుంది. అతడు ,సంపూర్తిగా దెవునికుఅమారుడు, విమోచకుని గురించి లెక్కలేనన్ని పాతనిబంధన ప్రవక్తలు ప్రవచించినరీతిలో ఆయనే పూర్తిగా నిర్వాహకుడాయాడు (ఆదికాండం 3:15; కీర్తనలు 22; యెషయా 53). ఆయన ఈ రీతిగా " నన్ను ఙ్ఞాపకము చేసికొనుటకై దీనిని చేయుడని" చెప్పినపుడు ఈ పండుగను భవిష్యత్తులో కూడ ఆయన వచ్చేంతవరకు కొనసాగించవలెనని సూచించాడు. ఇది కూడ పస్కా పండుగను సూచిస్తుంది, ఏ గొర్రెపిల్ల రక్తాన్ని వధించి మరియు మరల తిరిగి రానైయున్న వధకు తేబడిన దేవుని గొర్రెపిల్ల కొరకు ఎదురుచూస్తూ, లోకపాపములను తిసివేయడమే ఆ రాత్రి ప్రభుభోజము లో నెరెఏర్చబడింది. క్రీస్తు, పస్కా పశువు గా వచ్చినపుడు క్రొత్త నిబంధన ఒడంబడిక పాతనిబంధనను ఒడంబడికను భర్తీ చేసింది (1 కొరింథీయులకు 5:7), బలియాగమైనాడు (హెబ్రీయులకు 8:8-13). ఇంకా బలి అర్పించాల్సిన పద్దతి అవసరం లేనే లేదు (హెబ్రీయులకు 9:25-28). ప్రభురాత్రి భోజనసంస్కారము / క్రైస్తవ ఐకమత్యము అనేది కేవలము యేసుప్రభువు వారు మనకొరకు చేసినదానిని ఙ్ఞాపకముంచుకొని మరియు ఆయన త్యాగపూరితబలియాగం ద్వారా నుండి మనకు అనుగ్రహించే రక్షణను గూర్చి ఉత్సహించడమే.
ప్రశ్న: సాంప్రదాయబద్దమైన మతాన్ని నేనెందుకు నమ్మాలి?
సమాధానము:
నిఘంటువు నిర్వచనప్రకారము "మతము" అనగా ఆరాధించే దేవుడు లేక దేవుళ్లను నమ్ముట. సర్వ సాధారణంగా నడత మరియు ఆచారాలలో వ్యక్త పరచబడుట ఒక ప్రత్యేకమైన విశ్వాసప్రమాణము, ఆరాధన, మొదలగునవి, నీతిప్రమాణముగా గుర్తించబడుట. ఈ నిర్వచనము ప్రకారము బైబిలు సాంప్రదాయబద్దమైన మతము విషయమై మట్లాడుతుంది. కాని దానియొక్క ఉధ్దేశ్యము మరియు ప్రభావము దేవునిని సంతోషపరచలేవు.
ఆదికాండము 11 వ అధ్యాయములో మొట్టమొదటి సారిగా ఆచారబద్దమైన మతమును నోవహు సంతతివారు, దేవుని మాటకు విధేయతచూపిస్తూ భూమినంతటిని నింపుటకుగాను బాబేలు గోపురాన్ని కట్టడానికి సమకూడారు.వారు నమ్మింది మారుగా తమ ఐక్యతే ప్రాముఖ్యమని నమ్మారు దేవునితో సంభంధంకంటే. దేవుడు వారి భాషలను తారుమారుచేయుటవలన వారి సాంప్రాదాయమైన మతాన్ని పాడుచేసారు.
నిర్గమకాండం 6 వ అధ్యాయంలొ ఇశ్రాయేలీయుల దేశముకోసం దేవుడు ఒక మతాన్ని స్థాపించాడు. పది ఆఙ్ఞలు, ప్రత్యక్షగుడారపు విషయములోనున్న నియమములు, బలి అర్పణపద్దతులు అన్నియు దేవుడే ఏర్పరచాడు. మరియు వాటిని ఇశ్రాయేలీయులు అనుసరించారు. నూతన నిబంధన అధ్యాయనములో ఈ మతము యొక్క ఉద్డేశ్యము రక్షకుడు- మెస్సీయాయొక్క అవసరతను సూచించటానికే అని స్పష్టమౌతుంది (గలతీ 3, రోమా7). అయితే అనేకమంది తప్పుగా అర్థంచేసుకొని దేవునికి బదులుగా నియమాలను పద్దతులను ఆరాధించారు.
ఇశ్రాయేలీయుల చరిత్రలో అనేక సంఘర్షణలకు కారణము ఆచారబద్దమైన మతములే. ఉదాహరణకు బయలు దేవతను ఆరాధించుట (న్యాయాధిపతులు 6: 1రాజులు 18), దాగోను (1 సమూయేలు) మరియు మొలెకు ( 2రాజులు 23:10). దేవుడు ఈ మతానుచరులను సంహరించుట ద్వారా తన సర్వ శక్తిని సార్వ భౌమాధికారాన్ని చూపించాడు.
సువార్తలలో పరిసయ్యులు సద్దూకయ్యులు యేసుక్రీస్తుకాలములోనున్న ఆచరబద్డమైన మతమునకు ప్రతినిధులు. యేసుక్రీస్తు నిత్యము వారి తప్పుడు భోధనలవలన వేషధారణపూరితమైన జీవనశైలిని ప్రశ్నించాడు. పత్రికలో అనేక గుంపులు సువార్తకు మరికొన్ని ఆచారాలను, పనులను సువార్తకు జోడించారు. వారు విశ్వాసులపై వత్తిడి తీసుకువచ్చి క్రైస్తవత్వాన్ని మతాన్ని జోడించి అంగీకరించేలా చేసారు. గలతీ, కొలస్సీ పత్రికలలో ఇట్టి మతాలవిషయమై హెచ్చరించారు. ప్రకటన గ్రంధంలో అంత్యక్రీస్తు ప్రపంచములో ఒక మతాన్ని స్థాపించటంద్వారా సాంప్రదాయబద్దమైన మతప్రభావాన్ని సూచిస్తుంది.
అనేక సంధర్భాలలో సాంప్రదాయబద్ద మతము యొక్క ఉధ్దేశ్యం దేవుని నుండి దూరంచేయటమే జరుగుతుంది. అయితే బైబిలు ఖచ్చితంగా దేవుని ప్రణాళికలలోనున్న సాంప్రదాయబద్దమైన విశ్వాసులగురించి మాట్లాడుతుంది. సాంప్రదాయబద్దమైన విశ్వాసులగుంపును దేవుడు సంఘము అని పిలుస్తున్నారు. అపోస్తలుల కార్యములు , పత్రికలలో సంఘమునుంచి ఇచ్చిన సూచనలను బట్టి అది సాంప్రదాయబద్దమైనది మరియు అంతర సంభంధాలు కలిగియున్నదని అర్థం అవుతుంది. ఈ వ్యవస్థ భధ్రతను ఫలమును, మరియు ఇతరులను చేరటం విషయంలో సహాయపడుతుంది. సంఘంవిషయంలో దానిని "సాంప్రదాయబద్దమైన సంభంధం" అని దానినంటే బాగుంటుంది.
మతము అంటే మానవుడు దేవునితో కలిగియుండాలనుకున్నా సంభంధం. క్రైస్తవ విశ్వాసమయితే క్రీస్తుయేసుబలినిబట్టి దేవునితో మానవుడు కలిగియున్న సంభంధం. దేవునిని చేరటానికి ప్రణాళికలేదు (దేవుడే మనలను చేరాడు- రోమా 5:8). దీనితో గర్వించడానికి ఏమిలేదు (సమస్తమును కృపచేతనే స్వీకరించాడు- ఎఫెసీ 2:8-9).నాయకత్వపు విషయంలో విభేధాలకు తావులేదు (క్రీస్తు శిరస్సైయున్నాడు- కొలొస్సీయులకు 1:18). పక్షపాతమునకు తావులేదు (క్రీస్తునందు మనమందరు ఒక్కటే- గలతీ 3:28). సాంప్రదాయబద్దంగా సమకూడుట తప్పు కాదు. అయితే మతఫలితమైన నిష్టనియామాలపై కేంద్రీకరించుటయే సమస్య.
ప్రశ్న: ఏ దినము సబ్బాతు, ఆదివారము మరియు శనివారమా? క్రైస్తవులు సబ్బాతు దినము ఆచరిస్తారా?
సమాధానము:
ఇది తరచుగా రూఢిపరచేది ఏంటంటే "దేవుడు ఏదేనుతోటలో సబ్బాతుని ఆరభించాడు" ఎందుకంటే నిర్గమకాండం 20:11 లో నున్న" సబ్బాతుకు మరియు సృష్టికి ఉన్న సంభంధంనుబట్టి. అయినప్పటికి దేవుని ఏడవదినము విశ్రాంతినొందెను (ఆదికాండం 2:3), ఇది భవిష్యత్తులోని సబ్బాతు కట్టడను ముందుగా చూపిస్తుంది. ఇశ్రాయేలీయుల ప్రజలు ఇగుప్తును విడిచి పెట్టి వెళ్ళకముందు సబ్బాతును గురించి బైబిలులో రచించిన రాతలు ఏమిలేవు. లేఖనములో సబ్బాతు ఆదామునుండి మోషే వరకు పాటిస్తున్నారని ఎక్కడ కూడలేదు.
దేవుని వాక్యము చాల స్పష్టముగా సబ్బాతు దినము పాటించుట అనేది ఒక ప్రత్యేకమైన సూచనగా దేవునికి మరియు ఇశ్రాయేలీయులమధ్యనున్నది: "ఇశ్రాయేలీయులు తమ తరతరములకు విశ్రాంతి దినాచారమును అనుసరించి ఆ దినము నాచరింపవలెను: అది నిత్యనిబంధన. నాకును ఇశ్రాయేలీయుఅల్కును అది ఎల్లప్పుడును గురుతైయుండును; ఏలయనగా ఆరుదినములు యెహోవా భూమయాకాశములను సృజించి యేడవదినమున పని మాని విశ్రమించెనని చెప్పుము" (నిర్గమకాండం 31: 16-17).
ద్వితియోపదేశకాండం 5లో మోషే వెనుకటి తరమువారికి పది ఆఙ్ఞలను మరల నొక్కి వక్కాణించెను. ఇక్కడ, 12-14లో సబ్బాతు దినము పాటించుట గూర్చి ఆఙ్ఞాపించిన తర్వాత, మోషే ఆఙ్ఞాపించినట్లు కారణము చెప్పెను "నీవు ఇగుప్తు దేశమందు దాసుడవైయున్నప్పుడు నీ దేవుడైన యెహోవా బాహుబలముచేతను చాచిన చేతిచేతను నిన్ను అక్కడనుండి రప్పించెనని ఙ్ఞాపకము చేసికొనుము. అందుచేతను విశ్రాంతి దినము ఆచరింపవలెనని నీ దేవుడైన యెహోవా నీకు ఆఙ్ఞాపించెను" (ద్వితియోపదేశకాండం 5:15).
దేవుడు ఇశ్రాయేలీయులకు సబ్బాతును ఇచ్చుటలోని ముఖ్యోధ్దేశ్యమేంటంటే వారు సృష్టిచేసిన విధానమును ఙ్ఞప్తిలోనికి తెచ్చుకుంటారని కాదుగాని, వారు ఇగుప్తీయుల బానిసత్వమునుండి దేవుడు వారిని విమోచించినరీతిని ఙ్ఞాపకంచేసుకుంటారని: సబ్బాతు కట్టడను ఆచరించే వ్యక్తి ఇంటిని విడిచి పెట్టకూడదు ( నిర్గమ 16:29), ఎక్కడను అగ్ని రాజబెట్టకూడదని ( నిర్గమ 35:3)ఎవరిని పనిచేయుటకు కారకుడు అవ్వకూడదని (ద్వితియోపదేశకాండం 5:14). సబ్బాతు దినమును నుల్లఘించినవ్వడు మరణ శిక్షకు పాత్రుడు (నిర్గమ 31:15; సంఖ్యాకాండం 15:32–35).
నూతననిబంధన భాగాలలో పరీక్షించినవిధంగా నాలుగు ప్రాముఖ్యమైన విషయాలు ఎత్తిచూపిస్తున్నాయి. 1). క్రీస్తు తన పునరుత్ధానమయిన రూపములో కనబడినప్పుడైన మరియు దినము చెప్పబడినట్లు , అది ఎప్పుడు వారములోని మొదటి దినము (మత్తయి 28:1, 9, 10; మార్కు 16:9; లూకా 24:1, 13, 15; యోహాను 20:19, 26. 20. అపోస్తలుల కార్యముల నుండి ప్రకటన గ్రంధం వరకు- ఒకేఒకాసారి సబ్బాతు ఉదహరిణ్చబడింది. అది కేవలము సౌవార్తీకరణ ఉద్దేశ్యములోనే మరియు అది సునగోగులో యూదులకు పరిమితము మాత్రమే (అపోస్తలులకార్యములు అధ్యాయములు 13–18). పౌలు రాశాడు " యూదులను సంపాదించుకొనుటకు యూదులకు యూదునివలె వుంటిని" ( 1 కొరింథీయులకు 9:20). పౌలు సునగోగులో పరిశుధ్దులతో సహవసించుటకు లేక వారిలో ఙ్ఞానవృధ్ధిని కలుగచేయుటకు వెళ్ళలేదుగాని వారిని ఒప్పింపచేసి మరియు నశించినవారిని రక్షించటానికి. 3). ఒకసారి పౌలు ఈ విధంగా చెప్పాడు "యికమీదట అన్యజనులయొద్డకు పోవుదునని చెప్పెను" (అపోస్తలుల కార్యములు 18:6), సబ్బాతు మరలా ఎన్నడూ చెప్పబడలేదు. మరియు 4). సబ్బాతు దినమునకు అనువర్తనము సూచించుటకు బదులు, నూతన నిబంధననలో ఙ్ఞప్తికి తెచ్చేది (మూడవ సూచనకు పైనవన్ని ఒకటి తప్పించి కొలస్సీ2:16 సమకూర్చబడింది).
నాల్గవ అంశమునకు పైనవన్ని కూలంకుశంగా పరిశీలించినట్లయితే నూతన నిబంధననకు చెందిన విశ్వాసి ఖచ్చితముగా సబ్బాతు పాటించాలని అని ఎటువంటి ఆటంకము కనబడలేదని ప్రత్యక్షపరచబడుతుంది. మరియు ఆదివారము అనే ఆలోచనను "క్రైస్తవ సబ్బాతు" కూడా లేఖనేతరమైనది లేక లేఖనమునకు వ్యతిరేకమైనది. పైన చర్చించిన విధంగా సబ్బాతు ఒక్కసారే ఉచ్చరింపబడింది. పౌలు అన్యజనులను గురించి ఉధ్దేశించుట మొదలుపెట్టినపుడు,"కాబట్టి అన్నపానముల విషయములోనైనను, పండుగ అమావాస్య విశ్రాంతిదినము అనువాటి విషయములో నైనను, మీకు తీర్పుతీర్చ నెవరికిని అవకాశమియ్యకుడి. ఇవి రాబోవువాటి ఛాయయేగాని నిజ స్వరూపము క్రీస్తులో ఉన్నది (కొలస్సీయులకు 2:16-17). యేసుక్రీస్తు ప్రభువు యూదుల సబ్బాతును విషయమై లిఖించబడ్డ చేవ్రాతను సిలువపై ఎత్తివేసినారు " దానిమీది చేవ్రాతను తుడిచివేసి, మనకు అడ్డములేకుండ దానిని ఎత్తివేసి"(కొలస్సీయులకు 2:14).
ఈ ఆలోచన ఒకసారికంటే మరల తిరిగి ఎక్కువ సార్లు చెప్పబడింది నూతన నిబంధనలో చెప్పబడింది: "పరుని సేవకునికి తీర్పుతీర్చుటకు నీవెవడవు? అతడు నిలిచియుండుటయైనను పడియుండుటయైనను అతని సొంత యజమానుని పనియే: అతడు నిలుచును, ప్రభువు అతనిని నిలువబెట్టుటకు శక్తిగలవాడు. ఒకడు ఒక దినముకంటె మరియొకదినము మంచిదని యెంచుచున్నాడు; మరియొకడు ప్రతిదినమును సమానముగా ఎంచుచున్నాడు; ప్రతివాడు తనమట్టుకు తానే మనస్సులో రూఢిపరచుకొనవలెను" ( రోమా14:4:5-6అ). "ఇప్పుడు మీరు దేవునిని ఎరిగినవారును, మరి విశేషముగా దేవునిచేత ఎరుగబడినవారునై యున్నారు గనుక, బలహీనమైనవియు నిష్ ప్రయోజనమైనవియునైన మూల పాఠములతట్టు మరల తిరుగనేల? మునుపటివలె మరల వాటికి దాసులైయుండ గోరనేల? మీరు దినములను, మాసములను, ఉత్సవకాలములను, సంవత్సరములను ఆచరించుచున్నారు?" ( గలతీ పత్రిక 4: 9-10).
కాన్ స్టంటైన్ చేసిన ప్రమాణము క్రీ.శ. 321 లో సబ్బాతును ఆచరించుట శనివారమునుండి ఆదివారమునకు "మార్పు చేయబడింది"- ఆదిమ శిష్యులు ఆరాధించుటకు ఏ దినము కూడుకొనేవారు? లేఖనములు ఎన్నడూ సబ్బతు (శనివరము)అని నుచ్చరింపలేదు. విశ్వాసుల కూడికలు, సహవాసం మరియు ఆరాధనకొరకు. ఏదిఏమైనప్పటికి, చాలా పాఠ్యభాగాలలో వారము మొదటిరోజున అని ప్రస్తావించబడింది. ఉదాహరణకు అపోస్తలుల కార్యములు 20:7 లో చెప్పబడింది "ఆదివారమున మేము రొట్టె విరచుటకు కూడినప్పుడు". 1కొరింథీ పత్రిక 16:2లో " నేను వచ్చినప్పుడు చందా పోగుచేయకుండ ప్రతి ఆదివారమున మీలో ప్రతివాడును తాను వర్ధిల్లినకొలది తనయొద్డ కొంత సొమ్ము నిలువ చేయవలెను." పౌలు కొరింథీ విశ్వాసులను అత్యధికముగా " సేవ" 2 కొరింథీ 9:12, పౌలు ఈ బహుమానమును సేవగా పరిగణించాడు కాబట్టి, ఈ సముదాయపరచిన దానిని క్రైస్తవ సమాజారము యొక్క ఆదివారపు ఆరాధన , సేవ పరిచర్యను కలిపారు. చారిత్రాత్మకంగా ఆదివారం, శనివారంకాదు. సామాన్యంగా సంఘంలో క్రైస్తవులు కూడుకొనే దినం. ఈ ఆచరణ అలవాటు మొదటి శతాబ్ధపు ఆదిమ సంఘపు అలవాటును సూచిస్తుంది.
సబ్బాతు ఇశ్రాయేలీయులకు ఇవ్వబడింది సంఘమునకు కాదు. సబ్బాతు అనగాఅ ఇంకా శనివారమే, ఆదివారం కాదు, అది ఎన్నడూ మారలేదు. సబ్బాతు పాతనిబంధన కట్టడలోని ఒక భాగము. మరియు క్రైస్తవులు ఈ న్యాయ విధినుండి స్వతంత్రులుగా చేయబడ్డారు (గలతీయులకు 4:1-26; రోమా 6:14). సబ్బాతు ఇంకా పాటించటం క్రైస్తవులకు తగదు. అది ఆదివారమైనా,లేక శనివారమైనా , వారంలో మొదటి రోజు, ఆదివారము ప్రభుని దినము (ప్రకటన 1:10) పునరుత్ధానుడైన క్రీస్తుని శిరస్సుగా వుంచి నూతన సృష్టిని వుత్సహిస్తుంది. మనము మోషే నియమించిన సబ్బాతుదినపు - విశ్రాంతి న్యాయవిధిని అనుకరించాల్సిన అవసరంలేదు, గాని ఇప్పుడు పునరుత్ధానుడైన క్రీస్తుని- పరిచర్య, సేవిస్తూ వెంబడించవచ్చు. అపోస్తలుడైన పౌలు చెప్పాడు క్రైస్తవుడు వ్యక్తిగతంగా నిర్ణయించుకోవాలి సబ్బాతు, విశ్రాంతిని ఆచరించావలెనా లేదా అనేది " ఒకడు ఒక దినముకంటె మరియొకదినము మంచిదని యెంచుచున్నాడు; మరియొకడు ప్రతిదినమును సమానముగా ఎంచుచున్నాడు; ప్రతివాడు తనమట్టుకు తానే మనస్సులో రూఢిపరచుకొనవలెను" ( రోమా14:5). మనము ప్రతిదినము ఆయనను ఆరాధించబద్దులమై యున్నాము, ఒక శనివారమా లేక అదివారమా మత్రమే కాదు.
ప్రశ్న: పాస్టరమ్మలు/ ప్రసంగీకురాలు? స్త్రీలు పరిచర్య చేయుట విషయములో బైబిలు ఏమంటుంది?
సమాధానము:
స్త్రీలు ప్రసంగించడం, సంఘంకాపరులుగా వుండడం అనే అంశం కంటె ఎక్కువగా వాదించగలిగే అంశం సంఘంలో మరోకటి వుండదేమో. కాబట్టి పురుషులకు వ్యత్యాసముగా స్త్రీలను పెట్టి ఈ అంశంను చూడటం మంచిదికాదు. స్త్రీలు సంఘకాపరులుగా వుండకూడదని బైబిలు కొన్ని ఆంక్షలు పెడ్తుందని విశ్వసించే స్త్రీలున్నారు. మరియు కొంతమంది స్త్రీలు పరిచర్య చేయవచ్చని ప్రసంగీకులుగా వుండటానికి ఎటువంటి ఆంక్షలు లేవని నమ్మే పురుషులు కూడా వున్నారు. ఇది స్త్రీ, పురుషుల మధ్య వ్యత్యాసము చూపించే అంశంకాదు. కాని బైబిలు భాష్యానికి సంభందించినది.
1తిమోతి: 2:11-12 లో "స్త్రీలు మౌనముగా ఉండి, సంపూర్ణ విధేయతతో నేర్చుకొనవలెను. స్త్రీ మౌనముగా వుండవలసినదేగాని, ఉపదేశించుటకైనను, పురుషులమీద అధికారము చేయుటకైనను ఆమెను సెలవియ్యను" అని దేవుని వాక్యం ప్రకటిస్తుంది. సంఘంలో స్త్రీ పురుషులులకు వేర్వేరు పాత్రలు చేపట్టడానికి దేవుడు అప్పగించాడు. మానవులు సృజించబడినటువంటి విధానమునుబట్టి మరియు పాపము ప్రవేశించిన తీరునుబట్టి వచ్చిన పర్యవసానము (1తిమోతి: 2:13-14). దేవుడు అపొస్తలుడైన పౌలు ద్వారా స్త్రీలు భోధించే భాధ్యత, పురుషులపై ఆధిపత్య్హాని కల్గివుండరాదని ఆంక్షలు విధించాడు. దీనిని బట్టి స్త్రీలు సంఘకాపరులుగా పురుషులపై ఆదిపత్యాన్ని, భోధించడం, ప్రసంగించడం అనే పరిచర్యలు చేయకూడదని అడ్డగిస్తుంది.
స్త్రీలు పరిచర్య చేయుటవిషయంపై అనేకమైనటువంటి "ఆక్షేపణలు"న్నాయి. అందులో సర్వ సామాన్యమైనది పౌలు మొదట శతాబ్దపు చదువులేనటువంటి స్త్రీలను భోదించవద్దని నియత్రించినది. అయితే 1తిమోతి: 2:11-14 విద్యస్థాయిని ప్రస్తావించుటలేదు. పరిచర్యకు విద్య అనేది అర్హత అయినట్లయితే యేసుక్రీస్తు శిష్యులలో ఎక్కువశాతం మంది యోగ్యతను కోల్పోతారు. పౌలు కేవలం ఎఫెస్స్సెసు పటణములో వున్న స్త్రీలను మాత్రమే నియత్రించాడు అన్నది రెండవ సామాన్య ఆక్షేపణ (తిమోతి మొదటి పత్రికను ఎఫెస్సీ సంఘంనకు కాపరిగా వున్నప్పుడు రాశాడు). ఎఫెస్సెసు పట్టణము గ్రీకు, రోమా దేవత అర్తమయిపేరనవున్న దేవాలయమునకు ప్రసిధ్ది. అర్తమయిని ఆరాధించుటలో స్త్రీలు అధికారము కలిగిన వారుగానున్నారు. అయితే మొదటి తిమోతి గ్రంధంలో అర్తమయిని ఎక్కువగా ప్రస్తావించలేదు. అంతేకాదు, అర్తమయిని ఆరాధించుట అనే విషయాన్ని బట్టి పౌలు ఆంక్షలు విధిస్తున్నట్లుగా 1తిమోతి: 2:11-12 లో వ్రాయలేదు.
పౌలు భార్య భర్తలకే సూచనలిస్తున్నాడని స్త్రీ పురుషులకు కాదు అన్నదే మూడవ ఆక్షేపణ. ఈ వాక్య భాగములో ఉపయోగించిన గ్రీకుపదాలు భార్య భర్తలకు వర్తిస్తాయి. అయితే వాటి ప్రాధమిక అర్ధం స్త్రీ పురుషులకు కూడా వర్తిస్తాయి. అంతేకాకుండా 8-10 లో అదే గ్రీకుపదాన్ని వాడారు. "కోపమును సంశయమును లేనివారై, పవిత్రమైన చేతులెత్తి ప్రార్ధన చేయుట కేవలం పురుషులకు మాత్రమేనా? (8) కేవలం స్త్రీలు మాత్రమే అణుకువయు స్వస్థబుధ్దియు గలవారై యుండి, తగుమాత్రపు వస్త్రాలు కలిగి, దైవభక్తి కలిగియుండాలా? (9-10 వచనాలు) ముమ్మాటికి కాదు. 8-10 వచనాలు కేవలం భార్య భర్తలకే మాత్రమే కాకుండా స్త్రీ పురుషులందరికి వర్తిస్తాయి. వచనాలు 11-14 సంధర్భానుసారంగా గమనిస్తే భార్య భర్తలకే వర్తించినట్లు సూచనలు లేవు.
పాతనిభంధనలోని మిర్యాము, దెబోరా, హుల్ధా లాంటి స్త్రీలు ప్రాముఖ్య నాయకత్వపు హోదాను కలిగి యుండటాన్ని సూచిస్తూ స్త్రీలు పరిచర్య అనే భాష్యంవిషయంలో తరచుగా మరొక ఆంక్షను ఎదుర్కోంటాం. ఈ ఆంక్ష కొన్ని ప్రాముఖ్యమైన విషయాలను గుర్తించటంలో విఫలమౌవుతుంది. మొదటిది దెబోరా, పదముగ్గురు పురుష న్యాయాధిపతులమధ్య ఏకైక స్త్రీ న్యాయాధిపతి. భైబిలు పేర్కొన్న అనేక పురుష ప్రవక్తలమధ్య హుల్ధా ఏకైక స్త్రీ, ప్రవక్త్రినీగా వున్నది. మోషే అహరోనుల సహోదరునిగా మిర్యాము నాయకురాలిగా సూచించబడింది. రాజుల కాలములో పేర్కొనబడినటువంటి ప్రాముఖ్యమైన ఇద్దరు స్త్రీలు అతల్యా, జెజెబెలు, భక్తి కలిగినటువంటి నాయకురాండ్రగా ఉదహరించబడలేదు. పాత నిభంధనలో స్త్రీలు ఆధిపత్యముకలిగి యుండుట ఆనేది ప్రస్తుత అంశమునకు వర్తింపగలిగేది కానేకాదు. సంఘాలనుద్దేశించి రాసినటువంటి మొదటి తిమోతిలాంటి మరియు ఇతర సంఘము- క్రీస్తు- శరీరములో వచ్చిన మార్పులను సూచిస్తున్నాయి. ఆమార్పు ఇశ్రాయేలీయుల దేశము విషయము లేక పాతనిబంధనలోని మరి ఏ వ్యవస్థ విషయంకాదుగాని సంఘం అధికారం విషయమే.
క్రొత్తనిబంధనలోని ప్రిస్కిల్లా, ఫీబీల విషయమై ఇటువంటి వాదనేవున్నది. అపోస్తలుల కార్యములు 18 వ అధ్యాములో అకుల్లా ప్రిస్కిల్లాలు క్రీస్తునందు నమ్మకమైన పరిచారకులుగా చూడగలం. ప్రిస్కిల్ల పేరు ముందు ప్రస్తావించబడింది కాబట్టి పరిచర్యలో భర్త కంటే ఆమెదే “ప్రాముఖ్యమైన” స్థానమని కాబోలు. ఏది ఏమైనప్పటికి 1 తిమోతి 2:11-14 ప్రస్తావించిన విషయాలకు విరుద్దముగా సూచించలేదు. అకుల్లా ప్రిస్కిల్లాను అపొల్లోను తమ గృహములో చేర్చుకొని దేవుని మార్గమును మరి పూర్తిగా అతనికి విశదపరచిరి (అపొస్తలుల కార్యములు 18:26).
రోమా 16:1 ప్రకారము ఫీబేను “సేవకురాలిగా” కాకుండా “పరిచారకురాలిగా” గుర్తించినప్పటికి ఆమే సంఘంలో భోధకురాలు అని సూచించినట్లుగాదు. “భోధించుటకు సమర్థులు” అన్న అర్హత పరిచారకులకు వర్తిస్తుందిగాని పెద్దలకు ఇవ్వబడింది కాదు (1 తిమోతి 3:1-13 మరియు తీతుకు 1:6-9). తర్వాత “పెద్దలు” / “అధ్యక్షులు”/ “పరిచారకులు,” “ఏకపత్నీపురుషులు,” “ విశ్వాసులైన పిల్లలు” కలిగి మరియు “సజ్జన ప్రియులు” అని వివరించారు. ఈ అర్హతలన్ని పురుషులకే వర్తిస్తాయి. అంతేకాకుండా (1 తిమోతి 3:1-13 మరియు తీతుకు 1:6-9)మధ్యన పెద్దలకు, అధ్యక్షులకు, పరిచారకులకు పురుషలింగాన్నే ఉపయోగించారు.
1 తిమోతి 2:11-14 నిర్మాణపద్దతి “హేతువును” ప్రస్ఫుటముగా సూచిస్తుంది. పౌలు 11,12 వచనములలో ప్రస్తావించినటువంటి “కారణంను” 13లో చూడగలుగుతాం. ఎందుకు స్త్రీ భోధించకూడదు? లేక పురుషునిమీద ఎందుకు ఆధిపత్యాన్ని కల్గియుండకూడదు? ఎందుకంటే ఆదాము ముందు సృష్టించబడ్డాడు, ఆ తర్వాత హవ్వ. ఆదాము మోసపరచబడలేదుగాని స్త్రీ మోసపరచబచబడింది. దేవుడు ఆదామును మొదట సృష్టించి ఆ తర్వాత హవ్వను సహకారిగా అనుగ్రహించాడు. ఈ సృష్టి క్రమము కుటుంబములోను (ఎఫెసీయులకు 5:22-33)సంఘంనకు సార్వత్రికంగా వర్తిస్తుంది. స్త్రీ హవ్వ, మోసగించబడింది అన్న వాస్తవాన్ని హేతువుగా తీసుకొని సంఘకాపరిలుగా వుండకూడదని పురుషునితో ఆత్మీయ అధికారం కలిగియుండకూడదని స్త్రీలు సంఘకాపరులుగాను, పురుషులపై ఆత్మీయ ఆధికారము కలవారనుటకు సూచనైంది. దీని ఆధారంగా స్త్రీలు భోధించకూడదు ఎందుకంటె వారు సుళువుగా మోసగించబడతారు అని అంటానికి దారి తీస్తుంది. ఈ అంశం చర్చనీయమైనది, ఎందుకంటె స్త్రీలు (సుళువుగా మోసగించబడేవాళ్ళు) సుళువుగా మోసగించబడేదైతే పిల్లలకు, ఇతర స్త్రీలకు (ఇంకా సుళువుగా మోసగించబడేవాళ్ళు) భోదించమని ఎందుకు ఇతరులకు అనుమతించాలి? పాఠ్యభాగము ప్రస్తావిస్తుంది అదికాదు. స్త్రీలు పురుషులకు భోధించకూడదు లేక పురుషులపై ఆత్మీయమైన ఆధిపత్యము కల్గియుండకూడదు ఎందుకంటే హవ్వ మోసగించబడుతుంది. దీని కారణంగా దేవుడు పురుషులకే సంఘంలో అధికారంతో భోధించటానికి అధికారంఇచ్చాడు.
చాలామంది స్త్రీలు అతిధులకు ఆతిధ్యమివ్వడం, దయను చూపించడం, భోధించడం, సహాయం చేయటం వంటి వరముల విషయములో అధిగమిస్తారు. ఒక ప్రాంతీయ సంఘం యొక్క పరిచర్య స్త్రీలమీద ఆధారపడియుంటుంది. బాహాటముగా ప్రార్థించుట లేక ప్రవచించుట విషయములో సంఘంలోనున్న స్త్రీలను నియత్రించలేదు (1 కొరింధీయులకు 11:5), గాని పురుషులపై ఆత్మీయమైన ఆధికారపూర్వకమైన భోధన విషయములో మాత్రమే. స్త్రీలు పరిశుధ్దాత్ముని వరము కల్గియుండటం విషయంలో బైబిలు మాత్రము నియత్రించలేదు (1 కొరింధీయులకు 12). స్త్రీలు పురుషుల వలె పరిచర్య చేయుటకు, ఆత్మ ఫలములు కల్గియుండుటకు (గలతీయులకు 5:22-23), నశించినవారికి సువార్త అందించటానికి పిలువబడ్డారు (మత్త్తయి 28:18-20; అపోస్తలుల కార్యములు 1:8; 1 పేతురు 3:15).
దేవుడు సంఘంలో కేవలం పురుషులకు మాత్రమే ఆత్మీయమైన అధికారపూర్వకమైన భోధను చేయటానికి అభిషేకించారు. దీనికి కారణం పురుషులు శ్రేష్టమైన భోధకులని కాదు, లేధా స్త్రీలు తక్కువ తెలివి తేటలు గలవారని కాదు. ఇది కేవలం దేవుడు సంఘం వ్యవహరించాల్సిన పద్దతిని అ విధముగా రూపొందించినదానిని బట్టే. పురుషులు ఆత్మీయమైనటువంటి నాయకులుగా తమ జీవితాలలో మాదిరియైయుండాలి. స్త్రీలు తక్కువ అధికార భాధ్యతలను చేపట్టాలి. స్త్రీలు ఇతర స్త్రీలకు భోధించాలని (తీతుకు 2:3-5)ప్రోత్సాహించారు. స్త్రీలు పిల్లలకు భోధించకూడదని బైబిలు నియత్రించుటలేదు. పురుషులకు భోధించుట విషయములో స్త్రీలు నియత్రించబడుతున్నారు. దీనిని బట్టి స్త్రీలు సంఘకాపరులుగా, ప్రసంగీకులుగా వుండకూడదని హేతుబద్దంగా అర్ధమౌతుంది. దీని అర్ధం స్త్రీలు తక్కువ ప్రాధాన్యత కలిగినవారు అని కాదు, కాని పరిచర్య విషయంలో నిర్ధిష్ట గురి కలిగియుండటానికి, దేవుని ప్రణాళికను అంగీకారంగా తమ కిచ్చిన వరములకు అనుగుణ్యంగా వుండటానికి దోహదపడ్తుంది.