బైబిలుకు సంభంధించిన ప్రశ్నలు
ప్రశ్న: బైబిలును మనము చదవటం/ అధ్యయనం ఎందుకు చేయాలి?
సమాధానము:
మనము బైబిలును చదవాలి, అధ్యయనం చేయాలి. ఎందుకంటె మనకు ఇవ్వబడిన దేవుని వాక్యమును కాబట్టి.బైబిలు నిక్ఖర్చిగా "దైవావేశమువలన" కలిగినది (2 తిమోతీ 3:16).మరొక మాటలలొ , అది దేవునినిండి మనకు వచ్చిన వాక్కు. వేదాంతపండితులు చాల రకాలుగా ప్రశ్నించిన ప్రశ్నలన్నిటికి జవాబు దేవుడు లేఖనాలలో గుప్తపరచి యున్నారు. జీవిత ఉధ్దేశ్యమేమిటి? నేను ఎక్కడనుండి వచ్చాను? మరణము తర్వాత జీవం ఉందా? నేను పరలోకమునకు ఏవిధంగా వెళ్లగలను? లోకము చెడుతో ఎందుకు నిండియుంది? నేను మంచిచేయటానికి ఎందుకు కష్టపడాలి? వీటికి తోడుగా పెద్డ "ప్రశ్నలు" బైబిలు చాల ప్రయోగాత్మకంగా సలహాలను ఈ విషయాలలో ఇస్తుంది? నా తోటి భాగస్వామిలోనేనేమి చూడాలి? నేను విజయవంతమైన వివాహములను ఏవిధంగా కలిగియుండగలను? నిజమైన మంచి స్నేహితునిగా ఎలాగుండగలను? మంచి తల్లి/ తండ్రిగా ఏవిధంగావుండగలను? విజయము అంటే ఏంటీ? నేను ఏవిధంగా దానిని స్పంధించగలను? నేనెలా మార్పునొందగలను? నిజంగా జీవితంలో నన్నేమి ప్రభావితంచేయును? నేను వెనుకకు తిరిగి భాధనొందకుండ ఏవిధంగా జీవించగలను? పక్షపాతంగా జరుగుతున్న పరిస్థితులకు మరియు చెడు విషయాలకు మించి జీవితంలో విజయవంతంగావుండటానికి ఆ విషయాలపట్ల నేనేవిధంగా స్పందించగలను?
బైబిలును మనము చదవటం/ అధ్యయనం ఎందుకంటే పూర్తిగా నమాదగినది మరియు తప్పులులేనిది. పరిశుధ్దగ్రంధములు అనే చెప్పబడిన వాటిలో బైబిలు ప్రత్యేకమైనది అది నైతిక భోధనలనే భోధించుచూ "నన్ను నమ్మండి" అని చెప్పదు. దానికి మించి వందలకొలదిలోనున్న ప్రవచనాలను విఫులంగా పరీక్షించే అర్హతమనకున్న్నది. చారిత్రాత్మక రికార్డును వ్రాతలను పరీక్షించటానికి, శాస్త్రీయపరమైన సత్యాలను పోల్చి పరీక్షించుటకు అర్హతకలిగినవారిలో వున్నాము. ఎవరైతే బైబిలులో తప్పులున్నాయి అని ఖండిస్తారో సత్యము చూస్తున్నపుడు వారు చెవులు సత్యమువైపు మందగిలినవారైన వారవవచ్చు. యేసు ఒకసారి ఈవిధంగా అడిగారు, "నీ పాపములు క్షమింఅప్బడినవి" లేక నీవు లేచి నీ పరుపెత్తికొని వెళ్లుమని చెప్ఫ్ట సులభమా అని అడిగారు. ఆ తరువాత తన్నుతాను ఋజువు చేసుకున్నాడు పాపములు క్షమించాటనికి అర్హతకలిగినవాడని (మన కండ్లతో చూడలేని వాస్తవం), పక్షవాయువు గలవానికి స్వస్థపరచుటవలన (ఇవి చుట్టునున్న వారందరు కండ్లారాచూచి పరీక్షించగలిగింది). అలాగే, దేవుని వాక్యం సత్యమని ఖచ్చితమైన నిశ్చయత కలిగియుండవచ్చు. అప్పుడు అత్మీయ విషయాలు నీవు చర్చించవచ్చు. మనము ఏదైతే మన ఇంద్రియాలతో పరీక్షించలేమో వాటిని అవి సత్యమేమో అని ఆ విషయాలలో పరీక్షించటానికి , అవి ఏవనగా చారిత్రాత్మక ఖండితం, శాస్త్రీయంగా ఖండితం, ప్రవచనాత్మకంగా ఖండితము కాదో అవునో అని వాటికవే పరీక్షలద్వారా సత్యాన్ని బయలుపరచును.
బైబిలును మనము చదవటం/ అధ్యయనం ఎందుకంటే దేవుడు మార్పు లేనివాడు మరియు కారణము మానజాతి స్వభావములో మార్పుండదు కాబాట్టి. అది ఎప్పుడో వ్రాయబడినప్పుడు ఎలావర్తించేదో ఇప్పుడును అదేవిధంగా మనకు సమకాలీనమైనదై వర్తిస్తుంది. శాస్త్రీయ పరిఙ్ఞానములో మార్పు రావచ్చును గాని మానవజాతి స్వభావము వాని కోర్కెలలో మార్పుచెందదు. బైబిలు చారిత్రక పుటలను చూచినట్లయితే మనము కనుగొనవచ్చు. మనము ఒకవేళ వ్యక్తితో వ్యక్తికి కలిగివున్న సంభంధం గురించి లేక సమాజాల గురించి అని కనుగొనవచ్చు. "సూర్యుని క్రింద నూతనమైనది దేదియు లేదు" (ప్రసంగి 1:9). తప్పుడు స్థలాలలో వెతుకుతున్నట్లయితే - దేవుడు- మననుండి మరి కృపగలిగిన సృష్టికర్త- ఏదైతే మనకు శాశ్వతానందానిస్తుందో చెప్తుంది. ఆయన ప్రత్యక్ష ప్రరచబడిన వాక్యం, బైబిలు. చాలా ప్రాముఖ్యమైనది అనిది యేసు ప్రభువు వారు చెప్పిదేంటంటే "మనుష్యుడు రొట్టెవలన మాత్రము కాదు గాని దేవుని నోటనుండివచ్చు ప్రతిమాటవలనను జీవించును" (మత్తయి 4:4). మరొకరీతిలో మనము పూర్తిమంతముగా జీవితం జీవించాలంటే దేవుడు ఉద్డేశించినట్లుగా, మనము దేవుడు వ్రాసిన వాక్యాన్ని చదివి దానిని లక్ష్యము చేయాలి. " చాలా తప్పుడు భోధకులను బట్టి.
బైబిలు మనము కొలతగీసే బద్దగా ఇవ్వబడింది సత్యాన్ని తప్పుని వేరుపరచలేం చాలా తప్పుడు భోధకులను బట్టి. సత్యాన్ని తప్పుని వేరుపరచటానికి బైబిలు మనకు కొలతగీసే బద్దగా ఇవ్వబడింది. దేవునికేది ఇష్టమో అది చెప్తుంది. దేవుని పట్ల తప్పుడు అవగాహన కలిగియుండుటకు మనము విగ్రహాన్ని లేక అబద్దదేవతలను ఆరాధించటమే. మనము ఆరాధించే దేవుడు అట్లాంటి దేవుడు కాదు. బైబిలు భోధిస్తుంది ఒకడు ఏ విధంగా పరలోకమునకు వెళ్ళగలడో , అది కేవలము మంచిగా జీవించుటవలన కాదు లేక బాప్తిస్మము పొందుటవలన కాదు లేక ఈ లోకములో ఏదైనా చేస్తే కాదు ( (యోహాను 14:6; ఎఫెసీయులకు 2:1-10; యెషయా 53:6; రోమా 3:10-18, 5:8, 6:23, 10:9-13). దీనితో పాటు, దేవుని వాక్యం ప్రభోధిస్తుంది దేవుడు ఎంతగా మనలను ప్రేమిస్తున్నాడు(రోమా 5:6-8; యోహాను 3:16). ఈ రితిగా మనము నేర్చుకుంటున్నపుడు దానికి బదులుగా మనము ఆయన ప్రేమించుటకు ఆకర్షితులమవుతాం ( 1యోహాను 1:14).
బైబిలు మనలను తర్ఫీదు చేస్తుంది దేవునిని సేవించాలని (2 తిమోతి 3:17; ఎఫెసీయులకు 6:17; హెబ్రీయులకు 4:12). అది మనలను పాపములనుండి మరియు అంతిమ పర్యవసానమునుండి ఏవిధంగా రక్షింపబడాలో అని తెలుసుకొనుటకై తోడ్పడుతుంది (2 తిమోతి 3:15. దేవుని వాక్యమును ధ్యానించుట మరియు ఆయన భోధనలకు విధేయత చూపించుట, జీవితంలో విజయాన్నిచ్చేదిగా వుంటుంది(యెహోషువ 1:8; యాకోబు 1:25). దేవునివాక్యం మనలోనున్న పాపమును కనిపెట్టుటకు మరియు దానినుండి విముక్తిపొందుటకు సహాపయపడును (కీర్తనలు 119:9, 11).అది మన జీవితాన్ని నడిపించేది, మన భోధకులకన్నా మనలను తెలివి మంతులగా గాచేయును (కీర్తనలు 32:8, 119:99; సామెతలు 1:6). బైబిలు మనలను నిరంతరము నిలిచివుండని వాటినుండి, మన జీవితానికి సంభంధించని విషయాలపై కేంద్రీకరించి సంవత్సరాలను నిరూపయోగం చేయకుండా మనలను కాపడును (మత్తయి 7:24-27).
బైబిలును చదువుట మరియు ధ్యానించుట అనేది ఈ లోకములో తీపిగా కనిపించే ఆకర్షణలలో కొక్కెములా పట్టుకునే పాపపూరితమైన శోధనలలో, మనము వాటిని స్వంతం చేసుకోకుండా ఒకరినొకరి తప్పిదములను మనం సొంతం చేసుకోకుండా వాటినుండి నేర్చుకొనవచ్చు. అనుభవమే మనకు గొప్ప భోధకుడు, గాని పాపమునుండి నేర్చుకొనడానికి వచ్చేటప్పుడు ఇది నిజంగా కష్టతరమైన కౄరమైన భోధకుడు. ఇతరుల తప్పులనుండి మనను నేర్చుకొనుట చాలా ఉత్తమమైనది. బైబిలులోని అనేకమంది జీవితవిషేషాలు నుండి నేర్చుకొనవచ్చు. అందులో కొన్ని మంచి మరియు చెడుకు వేర్వేరు సమయాలలో వారి జీవితాలలే రోల్ మోడల్స్ గానున్నవి. ఉదాహరణకు, దావీదు, గొల్యాతును ఓడించునపుడు, మనలను ఎదుర్కోవాలని ఉద్దేశించినవాటన్నిటిలో దేవుడు గొప్పవాడని భోధిస్తుంది ( 1 సమూయేలు 17), తన్ను తాను బత్షెబతో వ్యభిచారము చేయుటకు శోధనలో పడినప్పుడు ఆ క్షణమాత్రపు ఆనాందాన్నికోసం నిరంతరము మరియు ఘోరమైన పర్యవసానానికి ఏవిధంగా గురవుతారో దానిగూర్చి ప్రత్యక్షపరస్తుంది( 2 సమూయేలు 11)
బైబిలు అనేది కేవలము చదువుటకు ఒక పుస్తకము మాత్రమే కాదు. ఈ పుస్తకమును అధ్యయించి దానిని అన్వయించుకొనుటకే. మరొకలాగైతే, అది ఆహారాన్ని నమలుకుండా మ్రింగివేయుటకు ప్రయత్నించి మరియు దానిని నోటినుండి ఉమ్మివేయుటకే- ఎటువంటి పోషకపధార్థాలను మనము పొందుకొనలేము. బైబిలు దేవుని వాక్యము. అది స్వభావపుయొక్క సరిహద్దులను బంధించేదిగా ఉంటుంది. మనము వాటిని త్రోయపుచ్చవచ్చు, గాని మనకు మనమే నష్టాన్ని తెచ్చుకున్నవారమౌతాం, ఏదో మనము గురుత్వాకర్షణ శక్తిని తృణీకరించినట్లవుతుంది. మనజీవితాలకు బైబిలు ఎంత ప్రాముఖ్యమో అనేది అది ఖచ్చితంగా నొక్కి వక్కాణించదు. బైబిలును అధ్యనయనము చేయుఇట ఒక బంగారపు గనిని త్రవ్విఅడంతో పోలుస్తున్నారు. మనము కొద్ది ప్రయత్నము చేసినట్లయితే "నీటి ప్రవాహమునుండి నుండి ప్రశస్తమైన రాళ్ళను జల్లించి వెతికితీసినట్లే" ఎక్కడో కొంచెము మాత్రమే బంగారపు పొడిని కనుగొనవచ్చు. గాని మనము ఎక్కువగా ప్రయత్నించి పరిశోధించి త్రవ్వినట్లయితే మనము కష్టపడిన రీతికి మరి బహుగా ప్రతిఫలము పొందుతాం.
ప్రశ్న: బైబిలు ప్రస్తుతకాలానికి వర్తిస్తుందా?
సమాధానము:
హెబ్రీ 4:12 చెప్తుంది: "ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలముగలదై రెండంచులుగల ఎటువంటి ఖడ్గముకంటెను వాడిగావుండి, ప్రాణాత్మలను కీళ్ళను మూలుగను విభజించునంతమట్టుకు దూరుచు, హృదయముయొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది." బైబిలు సుమారు 1900 సంవత్సరాలు క్రితం పూర్తిచేయబడినప్పటికి దాని ఖచ్చితత్వము మరియు వర్తింపు నేటికి మార్పులేనిదిగానున్నది. దేవుడు తనగురించి, మానవుల పట్ల తనకున్నా ప్రణాళికగురించి తన్నుతాను ప్రత్యక్షపరచుకోవటమే దేవుని యొక్క ఏకైక ఉధ్దేశ్యము.
ప్రకృతి ప్రపంచంగురించి శాస్త్రీయ పరిశోధనలద్వారా గమనించి ధృవీకరీంచిన సమాచారం బైబిలులో ఎంతోవుంది. కొన్ని పాఠ్యభాగాలు వాటిగురించి ప్రస్తావిస్తున్నవి అందులో ఉదాహరణకు లేవికాండం 17:11; ప్రసంగీ 1:6-7; యోబు 36:27-29; కీర్తనలు 102:25-27 మరియు కొలొస్సీయులకు 1:16-17. బైబిలులో దేవుని విమోచన ప్రణాళిక మానవుల పట్ల విశదమవుతున్నప్పుడు అనేక రకములైన పాత్రలు, వ్యక్తిత్వాలు వివరించబడ్డాయి. ఈ వివరణలో బైబిలు మానవ స్వభావం, తత్వముల విషయమై ఎంతో సమాచారం అనుగ్రహించబడ్డాయి. మన అనుదినానుభవంలో దాని అర్థమయ్యేదేంటంటే ఏ మనోతత్వశాస్త్రం వివరించలేనంత ఖచ్చితంగా మానవ స్వభావంగురించి వివరిస్తుంది.
బైబిలులో చారిత్రక వాస్తవాలుగా సూచిమ్చబడినవి ఎన్నో బైబిలేతర పద్దతులద్వారా ధృవీకరించబడ్డాయి. చారిత్రక పరిశోధన ఎంతో మట్టుకు బైబిలు సంఘటనలను ధృవీకరిస్తుంది.
ఏదిఏమైనప్పటికి, బైబిలు చరిత్రపుస్తకము కాదు. మనోశాస్త్ర గ్రంధంకాదు. శాస్త్రీయ పత్రిక కాదు. బైబిలు దేవుడు తన గురించి ఇచ్చిన వివరణ మానవులపట్ల తనకున్న కోరిక ప్రణాళికను కలిగియున్నది. ఈ ప్రత్యక్షతలో అతిప్రాముఖ్యమైన కధనం పాపమును బట్టి మనము ఏ విధంగా వేరుపర్చబడ్డాము మరియు సహవాసాన్ని తిరిగి నెలకొల్పడానికి దేవుడు తన కుమారుడు యేసుక్రీస్తుని సిలువమీద బలిగా అనుగ్రహించటం. మన విమోచన అవసరత మార్పు చెందదు. అంతేకాదు. మనతో సంభంధం పునరుధ్దీకరించే విషయంతో కూడ మార్పు వుండదు. బైబిలులో ఖచ్చితమైన మనకు వర్తించే ఎంతో సమాచారవున్నది.
బైబిలులో అతి ప్రాముఖ్యమైన సమాచారం - విమోచనగురించి- అది సార్వత్రికమైనది. నిరంతరము మానవులకు వర్తించేది. దేవుని వాక్యము ఎన్నటికి నిరుపయోగమైనదిగాను, కొట్టబడిపోయినట్లుగాను లేక అధికమించబడగలిగేదిగాను ఉండదు. సంస్క్ట్రుతులు మారవచ్చు. ధర్మశాస్త్రములు మారవచ్చు. తరాలు వస్తాయి. పొతాయి అయితే దేవుని వాక్యం ఎప్పటికి వర్తింపు గలిగేదిగానే వుంటుంది. లేఖనభాగమంతా మనకు వర్తించకపోవచ్చు కాని అందులోని సత్యం మనజీవితాలకు వర్తిస్తుంది.
ప్రశ్న: బైబిలు ప్రేరణ అంటే అర్థం ఏంటి?
సమాధానము:
బైబిలు ప్రేరేపించబడింది అని ప్రజలు ప్రస్తావించినపుడు అది మానవరచయితలు దైవ ప్రేరణనుబట్టి రాసినవి దేవుని వాక్కు అన్న వాస్తవాన్ని సూచిస్తుంది. లేఖనముల విషయములో ప్రేరణ అన్న పదమునకున్న అర్థం "దేవుని శ్వాస" అని అర్థం. దైవ ప్రేరణను బట్టి బైబిలు దేవుని వాక్కు మరియు ఇతర గ్రందములతో పోలిస్తే ప్రత్యేకమైంది.
బైబిలు ఎంతమట్టుకు ప్రేరేపించబడింది, అనేక ఉధ్దేశ్యాలున్నప్పటికి బైబిలు ఎటువంటి అనుమానంలేకుండా దానిలోవున్న ప్రతిమాట దేవునినుండి వచ్చిందే అనిసూచిస్తుంది (1 కొరింథీయులకు 2:12-13; 2 తిమోతీ 3:16-17). ఈ ధృక్పధాన్ని "వెర్బల్ ప్లీనరీ" అనగా ప్రతీమాట చెప్పబడింది అని అర్థం. ఈ ధృక్పధాన్ని బట్టి ప్రతిమాట ప్రేరేపించబడింది (వెర్బల్)- ఉధ్దేశ్యాలు, విషయాలు మాత్రమేకాదు- ప్రేరణ లేఖనములలోని, అన్ని భాగములకు, అన్ని అంశములలోని విషయాలకు వర్తిస్తుంది (ప్లీనరీ). కొంతమందైతే బైబిలులోని కొన్ని భాగాలు మాత్రమే ప్రేరేపించబడ్డాయని మత సంభంధమైన విషయాలు ఉధ్దేశ్యాలు మత్రమే ప్రేరేపించబడ్డాయని తలస్తుంటారు. అయితే బైబిలు దాని విషయమై పేర్కొన్నట్లుగా ప్రతీమాట ప్రేరేపించబడింది అన్నది తప్పవుతుంది. ప్రతీమాట ప్రేరేపించబడటం అనేది దేవుని వాక్కును ఉండాల్సిన ప్రాధమిక లక్షణము.
ఎంతమట్టుకు ప్రేరేపించబడిందో 2 తిమోతీ 3:16, "దైవజనుడు సన్నధ్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిధ్ధపడి యుండునట్లు దైవావేశమువలన కలిగిన ప్రతిలేఖనము, ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దిటకును, నీతియందు శిక్షచేయుటకును ప్రయోజనకరమై యున్నది." ఈ వచనం లేఖనములు దైవావేశముచేత అనుగ్రహించబడిందని మనకు ప్రయోజనకరమైనదని వివరిస్తుంది. బైబిలులోని మతపరమైన సిధ్దాంతములు కలిగిన భాగములు మాత్రమే లేక ఆదికాండం నుండి ప్రకటన గ్రందం వరకు కూడా ప్రేరేపించబడింది కాబట్టి లేఖనము సిధ్దాంతము విషయములో అధికారపూర్వకమైనది. మరియు దేవునితో సత్య సంభంధం కలిగియుండుట విషయంలో మానవులకు సరిపడే భోధనను అనుగ్రహించెను. బైబిలు దేవునిచేత ప్రేరేపించబడింది అని ప్రస్తావించటమే కాక మానవులు పరిపూర్ణముగా మార్చటానికి అతీతశక్తిని కలిగింది అని పేర్కొంటుంది. ఇంతకంటే మనకింక ఏమిఅవసరము?
దేవునివాక్యం ప్రేరపణ గురించి ప్రస్తావించే మరో వాక్య భాగం 2 పేతురు 1:21. ఈ వచనము మానవులు "వేరు వేరు వ్యక్తిత్వాలు కలిగియున్నప్పటికి దేవుడు వారిని ప్రేరేపించుట ద్వారా దేవుడు వారు రాసిన ప్రతీమాటను ప్రేరేపించాడని అర్థమవటానికి దోహదపడుతుంది. లేఖనములలోని ప్రతీమాట దైవప్రేరితమని యేసే ఈ మాటలు చెప్పుట ద్వారా ధృవీకరించాడు "ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచ్నములనైనను కొట్టివేయ వచ్చితినని తలంచవద్దు:నెరవేర్చుటకే గాని కొట్టివేయుటకు నేను రాలేదు. ఆకాశమును భూమియు గతించిపోయిననేగాని ధర్మశాస్త్రమంతయు నెరవేరువరకు దానినుండి యొక పొల్లయినను ఒక సున్నయైనను తప్పిపోదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాననెను (మత్తయి 5:17-18)". ఈ వచనాలలో లేఖనములయొక్క ఖచ్చితత్వము ఎంతో శునిసితమైందో ఎందుకంటే అది దేవుని వాక్కు కాబట్టి.
లేఖనములు దేవుని ప్రేరితమైన వాక్కు కాబట్టి అది తప్పులు లేనిది. అధికారపూర్వకమైనది. దేవుని పట్ల సరియైన ధృక్పధంను, దేవుని వాక్కు పట్ల సరియైన ధృక్పధం అన్ని వివరిస్తుంది. దేవుడు సర్వ శక్తివంతుడు , సర్వ ఙ్ఞాని, పరిపూర్ణుడు కాబట్టి ఆయన వాక్కు కూడ అటువంటి గుణగణములే ఉంటాయి. ఏ వాక్య భాగాలయితే లేఖనములు దైవ ప్రేరితములు అని సూచిస్తున్నయో అది తప్పులు లేనిది, అది అధికారపూర్వకమైనదని స్థాపిస్తుంది. అనుమానంలేకుండా బైబిలు పేర్కొన్నట్లుగా దేవుడు మానవులకనుగ్రహించిన తన వాక్కు అనుమానించతగనిది మరియు అధికారపూర్వకమైనది.
ప్రశ్న: బైబిలులో పొరపాట్లు, పరస్పరవిరుధ్దములు ,అసమానతలున్నాయా?
సమాధానము:
తప్పులు పట్టుకోవాలని పుర్వానుమానములు లేకుండ బైబిలు చదివినట్లయితే అది హేతుబద్డమైనదిగాను ఎప్పుడూ ఏకరీతిగాను అర్థంచేసుకోడానికి సులభతరముగా అగుపడే పుస్తకముగా అగుపడతాది. అవును. బైబిలులో కొన్ని కష్టమైన భాగములున్నవి. కొన్ని వచనములు పరస్పరమూ విరుద్డముగా అగుపడతాది. బైబిలు సుమారు 40 మంది రచయితలు 1500 సంవత్సారాల వ్యవధిలో రాసారు అన్న విషయాన్ని ఙ్ఞాపకముంచుకోవాలి. ప్రతీ రచయిత వేరు శైలిలో, వేరు ధృక్పధంతో, వేరు శ్రోతలనుద్దేశించి రచించారు. కాబట్టి అల్పమైన వ్యత్యాసలుండటం సహజం. అయితే అల్పమైన వ్యత్యాసం పరస్పర విరుధ్దం కాదు. అది కేవలం అగుపడే పొరపాటే అవుతుంది. ఒకవేళ ఆ వచనము, ఆ భాగం మిగిలిన వాటితో సరిపోల్చలేకపోయినట్లయితే కొన్ని సార్లు జవాబులు ఇప్పటికి దొరకక పోవచ్చు. దాని అర్థం అసలు జవాబులేదని కాదు. చాలమంది చారిత్రకంగా, భౌగోళికంగా కొన్ని తప్పులను చూపించారు. అయితే అవి సరియైనవని తర్వాత వెలికి తీసిన భౌగోళిక నిదర్శనాలనుబట్టి అర్థమౌవుతుంది.
చాల సార్లు మనము ఎందుర్కొనే ప్రశ్నలు ఎలా వుంటాయంటే " ఈ వచనాల పరస్పరము విరుధ్దముకారని ఎలా చెప్పగలరు? వాస్తవానికి ప్రజలు లేవనెత్తే కొన్ని ప్రశ్నలు కష్టమైనవే. అయితే మన వాదన బైబిలులో అగుపడే వున్న ప్రతీ పరస్పర విరుధ్దానికి పొరపాటుకి హేతుబధ్దమైన ఙ్ఞానయుక్తమైన జవాబులున్నాయనే. బైబిలులో అన్ని తప్పులు ఎత్తి చూపించే వెబ్ సైట్స్ కూడావున్నాయి. కొంతమంది తమ ఎత్తుగడలను ఈ సైట్స్ నుంచి దిచ్చుకుంటారు. అంతేగాని వారు వెతికికనుగొన్నావేమో కావు. అంతేకాదు. తప్పుగా ఎంచబడే వీటన్నిటికి జవాబుల్లు నిచ్చే పుస్తకాలు వెబ్ సైట్స్లు కూడా వున్నాయి. విషాదకరమైన విషయం ఏంటంటే బైబిలును త్రోసిపుచ్చేవారు. జవాబులు వింటానికి ఇష్టపడరు. అంతేకాదు బైబిలును ధిక్కరించే అనేకమందికి జవాబులు కూడ తెలుసు కాని సత్తాలేని తమ ప్రతివాదనలతో బైబిలుపై ధ్వజాన్నికొనసాగిస్తున్నారు.
అయితే బైబిలులో తప్పులున్నాయంటూ మనదగ్గరకు ఎవరైనా వస్తే మనము ఏం చేయాలి? 1). ప్రార్థన పూరితంగా లేఖనాలను పఠించి సులభతరమైన జవాబుందేమో చూడాలి. 2). బైబిలు వ్యాఖ్యానాలు, " బైబిలుసరి అనివాదించే వాస్తవాలు" మరియు బైబిలు పరమైన పరిశోధనకు సంభంధించిన వెబ్ సైట్లునుంచి కొంత పరిశోధనచేయాలి. 3). సంఘకాపరులను లేక నాయకులను జవాబులు అడిగి తెలుసుకోవాలి. 4). ఈ మూడు పద్దతులు 1), 2) మరియు 3) లలో కూడా జవాబులు దొరకనట్లయితే దేవుని నమ్మి ఆయన వాక్యము సత్యమని గ్రహించి పరిష్కారము ఇంకా గుర్తించబడలేదని గ్రహించాలి (2 తిమోతి 2:15, 3:16-17).
ప్రశ్న: బైబిలు కేనానును (కొలమానము)ఎప్పుడు, ఎలా సమకూర్చారు?
సమాధానము:
“కేనాను” అను పదమును దైవికప్రేరేపణచేత రచించిన బైబిలు పుస్తకములకు వుపయోగించే పదము. బైబిలు ఒక పుస్తకముల పట్టీని ఇవ్వరు కాబట్టి బైబిలు కేనాను లేక కొలమానమును నిర్థారించుట కష్టము అవుతుంది. బైబిలు కొలమానము ప్రక్రియను మొట్టమొదటిగా యూదా రబ్బీలు మరియు పండితులు నిర్వహించారు. ఆ తర్వాత ఆదిమ శతాబ్ధపు క్రైస్తవులు దానిని అనుకరించారు, అయితే , బైబిలుకెనానులో ఏ పుస్తకాలుండాలో నిర్ణయించింది అంతిమంగా దేవుడే. లేఖనములలోని ఒక గ్రంధంను దేవుడే ప్రేరేపించి రచించిన క్షణమునుండి అది కెనానుకు చెందినది. అది దేవుడు తన మానవ అనుచరులను ఒప్పించటం ద్వారా ఏ పుస్తకాలు బైబిలులో చేర్చాలో నిర్ణయించుటయే.
క్రొత్తనిబంధనతో పోల్చినట్లయితే పాతనిబంధన కెనాను విషయంలో కంటె తక్కువ సమస్యలు వున్నాయి. వివాదస్పదమైనది. హెబ్రి విశ్వాసులు దేవుని వర్తమానికులను గుర్తించి వారి రచనలను దైవిక ప్రేరణని గుర్తించారు. పాతనిబంధన కెనాను విషయంలో కొన్ని పుస్తకములు చర్చకు గురి అయినప్పటికి క్రీస్తు శకము 250 నాటికి హెబ్రూ కెనాను సార్వత్రిక అంగీకారమును పొందినది. అయితే కేవలం అపొక్రిఫ మాత్రమే నేటికి చర్చనీయాంశమైనది. అతి ఎక్కువ హెబ్రూ పండితులు అపొక్రిఫను మంచి చరిత్ర మరియు మత పరమైన పత్రము అని అంగీకరిస్తారు కాని మిగిలిన హెబ్రూ లేఖనములకు సమానమైన వాటివిగా కాదు.
క్రొత్త నిబంధన గ్రంధముల గుర్తింపు మరియు సేకరణ ప్రక్రియ మొదటి శతాబ్ధపు సంఘములో ఆరంభమయ్యింది. తొలి దినములలోనే కొన్ని నూతన నిబంధన పుస్తకములు గుర్తించబడ్డాయి. పౌలు లూకా వ్రాసిన గ్రంధములను పాతనిబంధన వలె అధికారపూర్వకమైనదని గుర్తించాడు (1 తిమోతి 5:18; మరియు చూడండి ద్వితియోపదేశకాండం 25:4 మరియు లూకా 10:7). పేతురు పౌలు రచనలను లేఖనములుగా గుర్తించారు (2పేతురు 3:15-16). క్రొత్తనిబంధనలోని కొన్ని పుస్తకాలను వేర్వేరు సంఘాలకు పంపిణీ చేసారు (కొలొస్సీయులకు 4:16; 1 ధెస్సలోనికయులకు 5:27). రోమాకు చెందిన క్లెమెంట్ క్రొత్టనిబంధనలోని పుస్తకాలగురించి ప్రస్తావించాడు (క్రీ.శ 95). అంతియొకయకు చెందిన ఇగ్నేషియస్ ఏడు పుస్తాకాలను గుర్తించాడు (క్రీ.శ 115).అపోస్తలుడైన యోహాను శిష్యడైన పాలికార్ప్ 15 పుస్తాకాలను అంగీకరించాడు (క్రీ.శ 108).ఆ తర్వాత ఇరేనియస్ 21 పుస్తకాలను (క్రీ.శ 185) ప్రస్తావించాడు. హిప్పోపొలిటస్ 22 పుస్తకాలను గుర్తించాడు. క్రొత్తనిబంధనలోని అతి ఎక్కువ వాదనకు గురియైన పుస్తకాలు హెబ్రీయులు, యాకోబు, 2 పేతురు, 2యోహాను మరియు 3యోహాను.
క్రీ.శ 170లో సమకూర్చబడిన మ్యురెటోరియన్ "కెనాన్" బైబిలు కొలమానములో తొలిది. మ్యురెటోరియన్ కెనాన్ నూతన నిబంధనలోని హెబ్రీయులకు, యాకోబు, మరియు 3 యోహాను పత్రిక తప్పించి మిగిలిన పుస్తకాలను చేర్చింది. క్రిస్తు శకము 363, లవోదికయ కౌన్సిల్ కేవలము పాతనిబంధన (అపొక్రిఫతో కలిపి) మరియు క్రొత్తనిబంధనలోని 27 పుస్తకాలు మాత్రమే సంఘాలలో చదవాలని నిర్ణయించింది. హిప్పో కౌన్సిల్ (క్రీ శ.393)మరియు కార్థేజ్ కౌన్సిల్ ఈ 27 పుస్తకాలు అధికపూర్వకమని ధృవీకరించాయి.
ఈ కౌన్సిల్స్ అన్నియుకూడ ఓ క్రొత్తనిబంధనపుస్తకం పరిశుధ్ధాత్మచేత ప్రేరేపించబడిందా లేదా అని నిర్థారించడానికి కొన్ని నియమాలు అనుసరించారు: 1)గ్రంధకర్త అపోస్తలులుడయి వుండాలి, లేదా అపోస్తలులయొక్క సన్నిహిత సంభంది అయివుండాలి. 2). ఈ పుస్తకమును క్రీస్తు సంఘం అంగీకరించిదా లేదా. 3). ఈ పుస్తకములోని సిద్దాంతములు ఒకే రీతిగా సాంప్రాదాయభోధనకు సిధ్దముగానున్నదా లేదా? 4) . ఆ పుస్తకము ఉన్నతమైన నైతిక మరియు ఆత్మీయ విలువలు , పరిశుధ్దాత్ముని యొక్క క్రియను ప్రతిబింబిస్తూ సాక్ష్యర్థ్యంగా వున్నదా లేదా? కెనాను నిర్థారించినది సంఘంకాదు అన్న ప్రాముఖ్యమైన అంశాన్ని గుర్తించుకోవాలి. ఏ అదిమ సంఘ కౌన్సిల్ కూడ కెనానును నిర్థారించలేదు. దేవుడు , కేవలము దేవుడే బైబిలులో ఏ పుస్తకాలుండాలో నిర్థారించాడు. తాను ముందుగా నిర్థారించిన విషయాలను దేవుడు తన అనుచరులకు అందించాడు. బైబిలు పుస్తకాలను సమకూర్చే మానవ ప్రక్రియలో తప్పులున్నప్పటికి దేవుడు తన సార్వ భౌమత్వాన్ని బట్టి మానవ అఙ్ఞానాన్ని , మొండితనాన్ని పక్కకు బెట్టి ఆదిమ సంఘం చేత పంపబడిన పుస్తకాలను గుర్తించుటలో సహాయపడ్డాడు.
ప్రశ్న: బైబిలు అధ్యయనము చేయటకు సరియైన విధానము ఏది?
సమాధానము:
ఒక విశ్వాసికి తన జీవితంలోనున్న ప్రాముఖ్యమైన పనియే లేఖనముల అర్థాన్ని సరిగ్గా నిర్వచించవలెనని నిర్థారించుకోవడం.దేవుడు మనకు నిష్కపటముగా బైబిలు చదవమిని చెప్పలేదు. దానిని బాగుగా అధ్యయనం చేసి సరిగ్గా వాడవలెను ( 2తిమోతి 2:15).అధ్యయనము చేయుట అనేది కొంచెం కష్టతరమైన పని. పైపైన లేక సంక్షేపముగా లేఖనాలను పరిశోధించుట కొన్ని సార్లు తప్పుడు భాష్యంతో సమాప్తి చేయడానికి దారితీయవచ్చు. అందుచేత, లేఖనముల అర్థాన్ని సరిగ్గా నిర్థారించటకు నిశ్చయించుకొనుటలో కొన్ని కీలకమైన మూల సూత్రాలు ప్రాముఖ్యమని గ్రహించాలి.
మొదటిగా, బైబిలు అధ్యయనము చేసే విధ్యార్థి పరిశుధ్దాత్ముని నడిపింపుతో అర్థాన్ని గ్రహించుటకు, ఎందుకంటె అది పరిశుధ్దాత్ముని పని గనుక ప్రార్థన చేయవలెను. "అయితే ఆయన, అనగా సత్య స్వరూపియైన ఆత్మ వచ్చినపుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును; ఆయన తనంతట తానే యేమియు భోదింపక , వేటిని వినునో వాటిని భోధించి సంభవింపబోవు సమ్గతులను మీకు తెలియ జేయును" (యోహాను 16:13). అపోస్తలు నూతన నిబంధన రాయుటకు పరిశుధ్దాత్ముడు నడిపించిన విధంగా, లేఖనముల అర్థాన్ని గ్రహించటానికి మనలను కూడ ఆయన నడిపించును. ఙ్ఞాపకముంచుకోండి, బైబిలు దేవుని గ్రంధం, గనుక దాని అర్థమేంటో ఆయనను మనము అడగాలి. నీవు క్రైస్తవుడవైనట్లైతే, లేఖనాల రచయిత- పరిశుధ్దాత్ముడు- నీలో నివసిస్తున్నవాడు, మరియు తాను రాసినదానిని నీవు గ్రహించాలని ఇష్టపడుతున్నాడు.
రెండవది, లేఖనభాగాలలోనుండి ఒక వచనము బయటకు లాగి ఆవచనపు భాగం చుట్టూ ఉన్న అర్థాన్ని, ఆ సంధర్భము బయట దాని అర్థాన్ని నిర్థారించుటకు మనము ప్రయత్నించకూడదు. మనము ఎప్పుడూ సంధర్భాన్ని అర్థంచేసుకొనడానికి వచనము చుట్టూ నున్న వచనభాగాలను, అధ్యాయాలను బాగా చదివాలి. లేఖనమంతయు దేవునినుండి వచ్చినవే (2 తిమోతీ 3:16; 2 పేతురూ 1:21),దేవుడు మానవులను రాయుటకు ఉపయోగించుకున్నాడు. ఈ మానవరచయితలకు వారి మనస్సులలో ఒకే అంశం, వ్రాయుటలో ఒకే ఉధ్దేశ్యము, మరియు వారు ఒక ప్రత్యేక విషయాన్ని సంభోధించారు. బైబిలులోని ఆ పుస్తకముయొక్క పూర్వనుమానమును తెలిసికొనుటకు చదవవలెను. ఆ పుస్తకమును ఎవరు రాశారు, ఎవరికోసం వ్రాయబడింది, ఎప్పుడు వ్రాయబడింది, మరియు ఎందుకొరకు రాయబడింది అని తెలిసికొనుటకు మనము చదవవలెను. మరియు, ఆ వాక్య భాగము దానికదే మనతో మాట్లాడటానికి మనము జాగ్రత్తవహించాలి. కొన్నిసార్లు ప్రజలు వారు అనుకున్న రీతిలో వారి సొంత మాటలకు అర్థాన్ని సంపాదించుకొనుటకు వారికి ఇష్టంవచ్చినట్లు భాష్యం చెప్పటానికి అప్పగించుకుంటారు.
మూడవది, బైబిలు అధ్యనము చేయుటలో మనమీదమనమే సంపూర్తిగా అధారపడకూడదు. జీవితాంతము లేఖనాలను బాగ అధ్యయించిన వారి పని నుండి మనము ఎందుకు నేర్చుకొనవలెను అనే దుర్వాహంకారమును వలన మనను దాని అర్థాన్ని గ్రహించలేం. కొంతమంది, తప్పుడు అభిప్రాయాలలో, కేవలము పరిశుధ్దాత్ముని మీదనే అధారపడుదామని బైబిలు ధ్యానించుటకు సమీపించడం మరియు వారు లోతైన మర్మములను కనుగొనగలరని అనుకోవడం. క్రీస్తు , పరిశుధ్దాత్ముని అనుగ్రహించుటలో క్రీస్తు శరీరములోనివారికి ఆత్మీయవరాలను అనుగ్రహించాడు. ఈ వచనాలలో ఒక ఆత్మీయవరాన్ని భోధించడం గురించి చెప్పబడింది ( ఎఫెసీయులకు 4:11-12; 1 కొరింథీయులకు 12:28). దేవుడు లేఖనాలను సరిగ్గా అర్థాన్ని గ్రహించడానికి. విధేయత చూపించటానికి ఈ భోధకులను అనుగ్రహించాడు. తోటి విశ్వాసులతో కలిసి బైబిలును అధ్యయనించటం, అర్థంగ్రహించటానికి ఆ దేవుని వాక్కులో నున్న సత్యాన్ని ఒకరినొకరు అన్వయించుకోవటంలో తొడ్పడగలరు.
గనుక ముగింపులో, బైబిలు అధ్యయనంచేయుటకు ఏది సరియైన పద్దతి? మొదట, ప్రార్థన మరియు వినయత, అర్థం గ్రహించడానికి పరిశుధ్దాత్ముని మీ ద ఆధారపడటం. రెండవది, వాక్య భాగాన్ని ఎప్పుడు సంధర్భానుసారంగా చదవటం, బైబిలు దానికదే మనకు భోధించుటను గమనించటం , మూడవది, వర్తమాన భూత భవిష్యత్కాలములో ఇతర కష్టపడి చదివిన దానిని గౌరవించటం, వారు కూడ బైబిలును సరిగ్గ అధ్యయనం చేయుటలొ వారి కష్టాన్ని గుర్తించటం. ఙ్ఞప్తిలోనికి తెచ్చుకోండి, దేవుడే బైబిలు రచయిత , మరియు నీవు దానిని గ్రహించాలని ఆయన ఇష్టపడుతున్నాడు.