రక్షణకు సంభంధించిన ప్రశ్నలు
ప్రశ్న: రక్షణ ఫ్రణాళిక/ రక్షణమార్గమంటే ఏమిటి?
సమాధానము:
నీవు ఆకలిగొనియున్నావా? శరీరానుసారమైనది ఆకలి కాదు. అ౦తకంటే నీ జీవితంలో ఎక్కువగా దేనికొరకైనా ఆకలి గొనియున్నావా? నీ అంతరంగంలో తృప్తిపరచబడనిది ఏదైనా వున్నదా? అలాగైతే యేసే మార్గము. యేసు చెప్పెను “జీవాహారమును నేనే; నా యొద్దకు వచ్చువాడు ఏమాత్రమును ఆకలిగొనడు, మరియు నా యందు విశ్వాసముంచువాడు దప్పిక గొనడు” (యోహాను 6:35)
నీవు కలవరము లో ఉన్నావా? నీ జీవితములో ఎన్నడూ ఒక ఉద్దేశ్యమును కనుగొన లేని స్థితిలో ఉన్నావా? ఎవరో లైటు ఆర్పివేయగా నీవు స్విచ్ కనుక్కోలేనట్లు వున్నదా? అలాగైతే, యేసే మార్గము: " నేను లోకమునకు వెలుగును, నన్ను అనుసరి౦చు వీడు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగి యుండును" అని యేసు ప్రకటించెను (యోహాను 8:12)
నీ జీవితంలో నీవు బంధింపబడినావని ఎప్పుడైనా అనిపించినదా? శూన్యము, అర్థ రహితమైన వాటినే కనుగొనుటకు, చాలా ద్వారములు తెరువ ప్రయత్నించావా ? సంపూర్తి చేయబడిన జీవితములో ప్రవేశించుటకు చూస్తున్నావా? అలాగయినచో యేసే మార్గము: “నేనే ద్వారమును, నా ద్వారా ఎవడైన లోపల ప్రవేశి౦చిన ఎడల వాడు రక్షింపబడిన వాడై లోపలికి పోవుచు, బయటకి వచ్చుచు మేత మేయుచుండును (యోహా 10:19)
ఇతరులు నిన్ను ఎప్పుడూ చిన్న చూపు చూస్తున్నారా! నీ సంబంధ బా౦ధవ్యాలు శూన్యముగాను ఖాళీగానున్నవా? ప్రతివారు నిన్నుబట్టి లాభ౦ పొందాలని ప్రయత్నిస్తున్నట్లు అనిపిస్తుందా! అయినచో యేసే మార్గము. “నేను గొర్రెలకు కాపరిని; మంచి కాపరి గొర్రెలను ఎరుగును, నా గొర్రెలు నన్ను ఎరుగును” అని యేసు చెప్పెను (యోహా: 10:11, 14)
ఈ జీవితం తరువాత ఏమగునోనని ఆశ్చర్యపోతున్నావా? పనికి రాని, తుప్పుపట్టిన జీవితం విషమై విసిగి పోయావా! అసలు ఈ జీవితమునకు ఏదైనా అర్ధముందా? అని సందేహపడినావా? నీవు చనిపోయిన తరువాత కూడా జీవించాలనుకుంటున్నావా? అలా అయితే యేసే మార్గము; పునరుద్ధానమును, జీవమును నేనే; నా యందు విశ్వాసముంచువాడు చనిపోయిననూ బ్రతుకును; బ్రతికి నా యందు విశ్వాసముంచు ప్రతివాడును ఎప్పటికినీ మరణి౦చడు. (యోహా 11:25,26)
ఏది మార్గము, ఏది సత్యము, ఏది జీవము “నేనే మార్గమును సత్యమును, జీవమును, నా ద్వారానే తప్ప యెవడును తండ్రి యొద్దకు రాడు” అని యేసు చెప్పెను (యోహా 14.6). నీవు ఆకలి గొనుచున్నది, ఆత్మ సంబంధమైన ఆకలి. యేసు చేత మాత్రమే తీర్చ బడగలదు. యేసు మాత్రమే చీకటిని తొలగి౦చ గలడు. తృప్తి పరచే జీవితమునకు యేసు మాత్రమే ద్వారము. నీవు ఎదురు చూచే స్నేహితుడు, కాపరి యేసే! యేసే జీవము- ఈ లోకమునకు, రాబోవు లోకమునకు రక్షణ మార్గము యేసే!
నీవు ఆకలిగొని యుండుటకు కారణము, నీవు చీకటిలో తప్పి పోయిన కారణము, నీ జీవితములో అర్థము గ్రహించలేకపోవుటకు కారణము- నీవు దేవుని నుండి వేరు చేయబడుటయే! మనమందరము పాపము చేసినందున దేవుని నుండి వేరు చేయబడ్డామని బైబిలే సెలవిస్తున్నది (ప్రసంగ౦ 7 20, రోమా 3 23). నీ హృదయమందు శూన్యము కనిపించుటకు గల కారణము నీ జీవితంలో దేవుడు లేనందువల్లనే. దేవునితో సంబంధము కల్గి యుండుటకు మనము సృష్టి౦చబడినాము. మన పాపము వల్ల ఆ సంబంధము నుండి మనము వేరు పర్చబడినాము. ఇ౦కా ఘోరమైనదేమంటే మన పాపము మనలను దేవుని నుండి ఈ జీవితములోనికి రాబోవు జీవితము నుండి నిత్యము వేరుచేస్తూ ఉ౦డడమే! (రోమా 6 23, యోహా 3:36)
ఈ సమస్య ఎలా పరిష్కరింపబడగలదు. యేసే మార్గము! యేసు మనపాపములను తనపైన వేసుకొనెను (2 కొరి 5 :21) మనము పొందవలసిన శిక్షను ఆయన తీసుకుని, మన స్థానములో యేసు చనిపోయెను. (రోమా 5:8). మూడు దినముల తరువాత యేసు మరణము నుండి లేచి, పాపము మీద, మరణము మీద ఆయన జయమును రుజువు చేసెను (రోమా 6: 45) ఎందుకు ఆయన అది చేసెను. “తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమగలవాడెవడును లేడు” అని ఆ ప్రశ్నకు యేసే సమాధానము చెప్పెను. ( యోహాను 15: 13) మనము జీవించునట్లుగా యేసు చనిపోయెను. మన విశ్వాసమును యేసు నందు ఉంచినట్లైతే, ఆయన మరణము మన పాపములకు పరిహారముగా చెల్లించాడని నమ్మినట్లైతే- మన పాపములన్నియు క్షమించబడి, కడిగిగివేయబడినట్లే. అప్పుడు మన ఆత్మీయ ఆకలి తీర్చబడును. తిరిగి, వెలుగు వచ్చును. సంపూర్తిచేయబడిన జీవితములోనికి మనకు మార్గముండును. మన మంచి కాపరిని, నిజస్నేహితుని కనుగొనగలము. మనము మరణించిన తరువాత జీవముందని గ్రహించగలము- పునరుద్ధాన జీవితము, పరలోకమందు యేసులో నిత్య జీవము.
“దేవుడు లోకమును ఎంతో ప్రేమించును. కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను”(యోహాను 3:16)
మీరు ఇక్కడ చదివారు కాబట్టి మీరు క్రీస్తు కొరకు ఒక నిర్ణయానికి వచ్చారా? అలా అయితే, క్రింద "ఈ రోజు నేను క్రీస్తును అంగీకరించాను" అను బటన్ క్లిక్ చేయండి.
ప్రశ్న: రక్షణ విశ్వాసము వలనే కలుగుతుందా? లేక క్రియలుకూడా అవసరమా?
సమాధానము:
క్రైస్తవ సిధ్దాంతములోనే బహుశా యిది అతి ప్రాముఖ్యమైన అంశంకావచ్చు. ఈ ప్రశ్న ప్రొటెస్టెంటు, ఖథోలిక్ సంఘాలకు మధ్యన విభజనకు, మరియు దిద్దుబాటుకు (రిఫర్మేషన్- మతోథ్దారణకు) దారితీసింది. బైబిలుకేంద్రిత క్రైస్తవత్వానికి, అబద్ద భోధనలకు మద్యన తారతమ్యం చూపించే ప్రాముఖ్యమైన అంశం కూడా ఇదే. రక్షణ విశ్వాసమువలనే కలుగుతుందా? లేక క్రియలుకూడా అవసరమా? నేను రక్షణపొందటానికి యేసుప్రభువునందు విశ్వాసముంచితే సరిపోతుందా లేక ఇంకేమైనా పనులు చేయాల్సిన అవసరం వుందా?
రక్షణ విశ్వాసము ద్వారానే మరియు విశ్వాసముతోకూడిన పనులవలనే అనే ఈ రెండు అంశాలుకు సంభందించి, ఖఛ్చితమైన వాక్యభాగాలు వుండటంబట్టి ఈ ప్రశ్న మరింత జఠిలంఅవుతుంది. రోమా 3:28: 5:1; గలతీ 3:24; యాకోబు 2:24 తో పోల్చిచూడండి. కొంతమంది పౌలు (రక్షణ విశ్వాసము వలనే) మరియు యాకోబు (రక్షణ విశ్వాసముతో కూడిన క్రియలువలన) మధ్య వ్యత్యసాన్ని చూస్తుంటారు (ఎఫెసి 2:8-9). విశ్వాసముమూలముగానే నీతిమంతుడుగా తీర్పుతీర్చబడుతారు అని పౌలు ఖండితముగ భోధిస్తే యాకోబు విశ్వాసమునకు క్రియలు జోడిస్తున్నట్లు అనిపిస్తుంది. యాకోబు యేమి రాస్తున్నాడు అని గమనించినట్లైతే ఈ విభేధాన్ని తొలగించుకోవచ్చు. ఓవ్యక్తి మంచి క్రియలులేకుండా విశ్వాసము కల్గియుండవచ్చు అనే నమ్మకాన్ని యాకోబు తృణీకరిస్తున్నాడు (యాకోబు 2:17-18). యేసుక్రీస్తునందు యధార్దమైన విశ్వాసము మార్పునొందిన జీవితముగా, మంచిక్రియలుగా ఫలిస్తుందని యాకోబు నొక్కివక్కాణించాడు (యాకోబు 2:20-26). నీతీమంతుడుగా తీర్పుతీర్చబడుటకు విశ్వాసంతోకూడిన క్రియలు అవసరము అని యాకోబు చెప్పడంలేదుగాని విశ్వాసముతో నీతిమంతుడుగా తీర్పు తీర్చబడిన వ్యక్తి జీవితములో మంచి క్రియలు ఖచ్చితముగా వుంటాయని యాకోబు చెప్పుతున్నాడు. ఓ వ్యక్తి విశ్వాసిని అని చెప్పుకొంటూ జీవితములో మంచి క్రియలు కనపర్చకపోనట్లయితే యేసుక్రీస్తునందు యధార్దమైన విశ్వాసము లేనట్లే(యాకోబు 2:14, 17, 20, 26).
పౌలు తన రచనలలో అదే విషయం చెప్పుతున్నాడు. ఓ విశ్వాసికి వుండాల్సిన మంచి ఫలముల జాబితను గమనించవచ్చు (గలతీ 5:22-23). మనకు క్రియలను బట్టి కాక విశ్వాసము వలననే రక్షణ అని భోధించిన పౌలు (ఎఫెసి 2:8-9), మంచి క్రియలు చేయుడానికే మనం సృజించబడ్డామని పౌలు తెల్పుతున్నాడు(ఎఫెసి 2:10). జీవితములో మార్పు అవసరమని యాకోబు భోధించినట్లే పౌలు కూడా ఆశిస్తున్నాడు.కాగా ఎవడైనను క్రీస్తునందున్న యెడల వాడు నూతన సృష్టి. పాతవి గతించెను. ఇదిగో క్రొత్తవాయెను (2కొరింధి 5:17). రక్షణకు సంభంధించిన విషయంలో యాకోబు, పౌలు ఒకరినొకరు విభేధించుకోవడంలేదు. ఒకే అంశాన్ని వేర్వేరు కోణంలో భోధిస్తున్నారు. విశ్వాసము ద్వారానే ఒకడు నీతిమంతుడుగా తీర్చబడును అని పౌలు క్షుణ్ణంగా నొక్కివక్కాణిస్తే క్రీస్తునందు అట్టి యధార్దమైన విశ్వాసము మంచిక్రియలుగా ఫలిస్తుందని యాకోబు వొక్కాణించాడు.
ప్రశ్న: ఒకసారి రక్షింపబడితే ఎప్పటికి రక్షింపబడినట్లేనా?
సమాధానము:
ఒకసారి రక్షింపబడితే ఎప్పటికి రక్షింపబడినట్లేనా? యేసుక్రీస్తును స్వంత రక్షకునిగా అంగీకరించినవారు దేవునితో సంభంధాన్ని ఏర్పరచుకొనుటయే కాక నిత్య భధ్రతను రక్షణ నిశ్చయతను కల్గి యుంటారు. పలు వాక్యభాగాలు ఈ వాస్తావాన్ని ప్రకటిస్తున్నాయి. ఎ) రోమా 8:30 ఈ విధంగా ప్రకటిస్తుంది. “మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను; ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను; ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమ పరచెను.” ఈ వచనం ప్రకారం దేవుడు మనలను ఎంపిక చేసిన క్షణమునుండి పరలోకములో ఆయన సన్నిధానములో మహిమ పర్చబడినట్లుగావుంటుంది. దేవుడు ఒక విశ్వాసిని పరలోకములో మహిమపర్చబడటానికి ఏర్పర్చాడు కాబట్టి దేనినుండి ఆపలేడు. దేవుడు ఉద్దేశించిన మహిమనుంచి ఒక విశ్వాసిని ఏది కూడ ఆపలేదు. నీతిమంతుడుగా తీర్పుతీర్చబడినటువంటి వ్యక్తికి రక్షణ ఖచ్చితము. పరలోకములో మహిమ ఉన్నదంతగా రూఢి గల్గినవాడు.
బి).రోమా 8:33-34 లో పౌలు రెండు కీలక ప్రశ్నలు లేవనెత్తుచున్నాడు. “దేవునిచేత ఏర్పరచబడిన వారిమీద నేరము మోపువాడెవడు? నీతిమంతులుగా తీర్పుతీర్చువాడు దేవుడే; శిక్ష విధించువాడెవడు? చనిపోయిన క్రీస్తుయేసే; అంతేకాదు, మృతులలోనుండి లేచినవాడును దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడును మనకొరకు విఙ్ఞాపనముకూడ చేయువాడును ఆయనే.” దేవునిచేత ఏర్పరచబడిన వారిమీద ఎవరు నేరము మోపగలరు? ఎవరు చేయలేరు ఎందుకంటే క్రీస్తే మన న్యాయవాది. ఎవరు శిక్ష విధించగలరు? ఎవరివలనా కాదు. మనకొరకు చనిపోయిన యేసుక్రీస్తు ఒక్కడే శిక్ష విధించగలడు. మనకు ఒక ఉత్తరవాదిగా, న్యాయవాదిగా ఆయన మనకు ఉన్నాడు.
సి).విశ్వాసులు తిరిగి జన్మించినవారు (యోహాను 3:3; తీతుకు 3:5) విశ్వసించినవారు. ఒక క్రైస్తవుడు రక్షణను కోల్పోవటం అంటే జన్మించకుండా ఉండిన వాడై యుండాలి. నూతన జన్మను తీసివేయబడతాది అంటానికి బైబిలులో నిదర్శనాలు లేవు. డి). ప్రతి విశ్వాసులందరిలో పరిశుధ్ధాత్ముడు ఉంటాడు (యోహాను 14:17; రోమా 8:9). క్రీస్తు యొక్క ఒక్క శరీరములోనికి బాప్తిస్మమిస్తాడు. ఒక విశ్వాసి రక్షణను కోల్పోవాలంటే పరిశుధ్ధాత్ముడు అతనిని “విడిచి వెళ్ళిపోవాలి.” క్రీస్తు శరీరమునుండి వేరు చేయబడాలి.
ఇ).యేసుక్రీస్తు నందు విశ్వాసముంచినవారు “నిత్య జీవముకలవారని” యోహాను 3:16 తెల్పుతుంది.ఒక రోజు నీవు క్రీస్తునందు విశ్వాసముంచినట్లయితే నీకు నిత్య జీవముంటుంది అయితే దానిని నీవు కోల్పోయినట్లయితే దానిని “నిత్యమైనది” అనలేము. కాబట్టి రక్షణను కోల్పోయినట్లయితే బైబిలులో నిత్య జీవమునకు సంభందించిన వాగ్ధానములు అబద్దములవుతాయి. ఎఫ్). వీటన్నిటిని ఆధారముచేసుకొని , ఈ వాదనలన్నిటిని రోమా 8:48-39 లో చూడగలము, “మరణమైనను, జీవమైనను దేవదూతలైనను ప్రధానులైనను ఉన్నవియైనను రాబోవునవియైనను అధికారులైనను ఎత్తయినను లోతైనను సృష్టింపబడిన మరి ఏదైనను,మన ప్రభువైన క్రీస్తునందలి దేవుని ప్రేమనుండి మనలను ఎడబాప నేరవని రూఢిగా నమ్ముచున్నాను.” నిన్ను రక్షించినటువంటి దేవుడే నిన్ను కాపాడతాడన్న మాటను ఙ్ఞాపకముంచుకో. ఒకసారి రక్షింపబడినట్లయితే ఎప్పటికి రక్షింపబడినట్లే. మన రక్షణ ఖచ్చితముగా నిత్యమూ భధ్రమే.
ప్రశ్న: నిత్య భద్రత లేఖానానుసారమా?
సమాధానము:
ఒక వ్యక్తి క్రీస్తుని రక్షకుడుగా తెలుసుకొన్నప్పుడు దేవునితో సంభంధం ఏర్పడుతుంది. మరియు నిత్య భద్రత వున్నదని భరోసా దొరుకుతునంది. యూదా 24:ఈ విధంగా చెప్తుంది. “తొట్ట్రిల్లకుండ మిమ్మును కాపాడుటకును, తన మహిమ యెదుట ఆనందముతో మిమ్మును నిర్ధోషులనుగా నిలువబెట్టుటకును.” దేవుని శక్తి ఒక విశ్వాసిని పడిపోకుండా కాపాడుతుంది. దేవుని మహిమ సన్నిధిలో నిలువ బెట్టుట ఆయన పని. నిత్య భద్రత దేవుడు మనలను కాపాడంటం బట్టి వచ్చే నిత్య భద్రత గాని మన రక్షణను మనము కాపాడుకొనుట కాదు.
“నేను వాటికి నిత్య జీవము నిచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికి నశింపవు, ఎవడును వాటిని నా చేతిలోనుండి అపహరింపడు. వాటిని నాకిచ్చిన నా తండ్రి అందరికంటె గొప్పవాడు గనుక నా తండ్రి చేతిలోనుండి యెవడును అపహరింపలేడు” అని యేసయ్య ప్రకటిస్తున్నాడు. తండ్రి మరియు యేసయ్య ఇరువురును తమ చేతులలో భద్రపరుస్తున్నారు. తండ్రి కుమారుల కభంధ హస్తాల నుంచి మనలను ఎవరూ వేరు చేయగలరు?
విశ్వాసులు “విమోచన దినమువరకు ముద్రింపబడియున్నారు” ఎఫెసీ4:30 తెల్పుతుంది. ఒకవేళ విశ్వాసుల నిత్య భద్రత విమోచన దినమువరకు ముద్రింపబడకుండా వుండినట్ట్లయితే అది మతభ్రష్టత్వమునకు, అపనమ్మకత్వమునకు లేక పాపమునకు అయిఉండాలి. యోహాను 3:15-16 చెప్తుంది ఎవరైతే యేసునందు విశ్వాసముంచుతారో వారికి “నిత్యజీవము వుందని.” ఒక వ్యక్తి నిత్య జీవాన్ని వాగ్ధానించి అది అతని యొద్దనుండి తీసివేయబడినట్లయితే అది “నిత్యమైనది” కానే కాదు.
నిత్య భద్రత వాస్తవము కానియెడల బైబిలులో వెల్లడించిన నిత్య జీవపు వాగ్ధానాలు అబద్దములే. నిత్య భధ్రత అతి శక్తివంతమైనటువంటి వాదన. రోమా 8:48-39 లో చూడగలము “మరణమైనను, జీవమైనను దేవదూతలైనను ప్రధానులైనను ఉన్నవియైనను రాబోవునవియైనను అధికారులైనను ఎత్తయినను లోతైనను సృష్టింపబడిన మరి ఏదైనను,మన ప్రభువైన క్రీస్తునందలి దేవుని ప్రేమనుండి మనలను ఎడబాప నేరవని రూఢిగా నమ్ముచున్నాను.” మన నిత్య భధ్రత మనలను ప్రేమించి, విమోచించిన దేవునిపై ఆధారపడివుంది. మన నిత్య భధ్రతను క్రీస్తువెలపెట్టి కొన్నాడు. తండ్రి వాగ్ధానంచేసాడు. పరిశుధ్దాత్ముడు ముద్రించాడు.
ప్రశ్న: యేసునుగూర్చి ఎన్నడూ వినని వారికి ఏమి జరుగుతుంది? యేసునుగూర్చి ఎన్నడూ వినుటకు అవకాశం లభించని వ్యక్తిని దేవుడు ఖండించునా?
సమాధానము:
ప్రజలందరూ యేసును గూర్చి వినిన లేక వినకపోయిన వారు దేవునికి జవాబుదారులు. బైబిలు స్పష్టముగా విశదపరుస్తుంది దేవుడు సృష్టిద్వారా తన్ను తాను ప్రత్యక్షపరచుకున్నాడు (రోమా 1:20) మరియు ప్రజల హృదయములో (పరమగీతములు 3:11) ఇక్కడ సమస్య మానవజాతియే పాపముతో నిండినవారు; మనమందరం దేవుని గూర్చిన ఙ్ఞామును తిరస్కరించి ఆయనకు వ్యతిరేకముగా తిరుగుబాటును చేసాము (రోమా 1:21-223). దేవుని కృపమనపట్ల లేనట్లయితే, మన హృదయానికి ఇష్టానుసారమైన పాపములు చేయటానికి అప్పగించబడేవాళ్ళం, మనము ఎంత పనికిమాలినవారమో, ఆయనకు వేరుగా ఎంత ధౌర్భాగ్యమైన జీవితం జీవిస్తున్నామో కనుగొనటానికి అనుమతించాడు.
వాస్తవంగా, ఇది కొంతమంది దేవుని విషయము విననివరి గురుంచే కాదు. దానికంటె అధికమైన సమస్యేంటంటే వారు ఏదైతే విన్నారో సృష్టిద్వారా ప్రత్యక్షమయిన దానిని ఏదైతే చూచారో దానిని తిరస్కరించారు. ద్వితియోపదేశకాండం 4:29లో "అయితే అక్కడనుండి నీ దేవుడైన యెహోవాను మీరు వెదకినయెడల, నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణాత్మతోను వెదకునప్పుడు ఆయన నీకు ప్రత్యక్షమగును."ఈ వచనము ఒక ముఖ్యమైన సూత్రాన్ని భోదిస్తుంది- ప్రతీ ఒక్కరూ ఎవరైతే దేవునిని వెదకుతారో వారు దేవునిని కనుగొంటారు. ఒక వ్యక్తి నిజంగా దేవునిని వెదకుటకు ఇష్టపడినట్లయితే దేవుడు ఆవ్యక్తికి ప్రత్యక్షపరచుకుంటాడు.
సమస్య ఏంటంటే "నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు గ్రహించువాడెవడును లేడు, దేవుని వెదకువాడెవడును లేడు" (రోమా 3:11). ప్రజలు దేవునిని గూర్చిన ఙ్ఞానమును అంటె సృష్టి ద్వారా, వారి హృదయములోను వెల్లడిపరచినదానిని తిరస్కరించి, దానికి బదులుగా వారు స్వహస్తాలతో చేసికొనిన సృష్టాన్ని “దేవుని” ఆరాధించటానికి నిర్ణయించుకున్నారు. యేసుక్రీస్తు సువార్తను వినటానికి ఒక్కసారికూడ అవకాశం లభించని వ్యక్తులను దేవుడు న్యాయమైన రీతిలో ఒకరిని నరకమునకు పంపించుట అనేదాన్ని గురించి వాదించటము అనాలోచితమైంది. బైబిలు చెప్తుంది ప్రజలు ఆయన ఙ్ఞానాన్ని తిరస్కరించారని మరియు అందుచేత వారి నరకానికి ఖండించుటలో దేవుడు న్యాయవంతుడు.
విననివారి గతి ఏంటి అని తర్కించుటకు బదులుగా , మనము, క్రైస్తవులముగా, మనకు చేతనైనంత వరకు శ్రేష్టమైనవిధంగా వారు ఖచ్చితముగా వినేటట్లు చూడటం. మనము సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుటకు పిలువబడ్డాము ( మత్తయి 28:19-20; అపోస్తలులకార్యములు 1:8). సృష్టి ద్వారా ప్రత్యక్షమైన దేవుని ఙ్ఞానాన్ని ప్రజలు తిరస్కరిస్తారన్ని మనము ఎరిగినప్పటికి అది మనలను యేసుక్రీస్తుద్వారా లభించే రక్షణ సువార్తను ప్రకటించాలని మనలను పురికొల్పుతుంది. దేవుని కృప కేవలము యేసుక్రీస్తుద్వారా లభించినదాన్ని అంగీకరించుటవలన , ప్రజలు వారి పాపాలనుండి రక్షించబడి, మరియు దేవునికి వేరుగా నిత్యత్వపు శిక్షనుండి తప్పింపబడుతారు.
ఒకవేళ సువార్త ఎన్నడూ విననివారికి ప్రత్యేకమైన కృప దేవుడు చూపిస్తాడు అని ఊహించుకుంటునట్లైతే మనము భీకరమైన సమస్యలో చిక్కుకుంటాం. ఒకవేళ ఎన్నడూ సువార్త వినని ప్రజలు రక్షించబడినట్లైతే ,ఇంకా ఎవరూ సువార్త వినకుండా ఖచ్చితంగా చూడటం సత్కారికం. మనము మరీ హీనంగా చేయగలిగిందేటంటే ఒక వ్యక్తికి సువార్తనందించి మరియు అతడు లేక ఆమె తిరస్కరించుటకు విడచిపెట్టుట మాత్రమే. ఈ వ్హిధంగా జరిగినట్లయితే ఆమె లేక అతడు ఖండించబడతారు. ప్రజలు ఎవరైతే సువార్త వినరో వారు నిషేధించబడాలి, లేకపోయినట్లైతే సువార్త అందించుటకు ప్రేరణ వుండదు. సువార్తను తిరస్కరిస్తారని మరియు ఎన్నడూ సువార్త వినలేదని ఎందుకంటే ఇంతకుముందే రక్షింబడ్డామని గర్హీంచుకొంటూ వుండే వారి వెంట ఎందుకు విపత్కరంగా వెంటపడాలి?
ప్రశ్న: యేసు మన పాపములనిమిత్తము మరణించకముందే ప్రజలు ఏవిధంగా రక్షింపబడ్డారు?
సమాధానము:
మానవుడు పడిపోయిన స్థితినుండి రక్షణకు ఆధారము యేసుక్రీస్తుప్రభువుయొక్క మరణమే. ఎవరూ లేరు. అయితే సిలువ వేయబడకముందు లేక సిలువవేసినదగ్గరనుండి, చారిత్రాత్మకంగా జరిగిన ఆ ఒక్క సన్నివేశంకాకుండా ఎవరైనా రక్షించబడగలరా? పాతనిబంధన పరిశుధ్ధుల గతించిన పాపాలకు మరియు క్రొత్త నిబంధన పరిశుధ్ధుల పాపాల నిమిత్తము క్రీస్తుమరణము పాపపరిహారము చెల్లించబడింది.
రక్షణ పొందుటకు కావల్సింది ఎప్పుడూ విశ్వాసము మాత్రమే. ఒకడు రక్షణపొందుటకు విశ్వాసముంచవలసిన అంశం దేవుడే. కీర్తనకారుడు రాశాడు "ఆయనను ఆశ్రయించువారందరు ధన్యులు" (కేర్తనలు 2:12). ఆదికాండం 15:6 చెప్తుంది అబ్రహాము దేవుని నమ్మెను. ఆయన అది అతనికి నీతిగా ఎంచెను (రోమా 4:3-8ని చూడండి). పాతనిబంధన ప్రాయశ్చిత్తార్థ పద్దతి పాపములను తిసివేయలేదు అని హెబ్రీయులకు 10:1-10 వరకు స్పష్టముగా భోధిస్తుంది. అది జరిగింది, ఏది ఏమైనా, దేవుని కుమారుని రక్తము పాపభూయిష్టులైన మానవులకొరకే చిందించిన దినాన్ననుండి అది తీసివేయబడింది.
యుగాలనుండి ఏదైతే మార్పు వస్తుందో దాని విషయం ఏంటంటే అది ఒక విశ్వాసియొక్క నమ్మిక. దేవునికి కావల్సినది ఆ సమయానికి మానవజాతికి ఏదైతే ప్రత్యక్షపరచాడో దానిని ఆధారంగా చేసుకొని నమ్మికయుంచటం. దీనిని క్రమమైన ప్రత్యక్షత అని పిలుస్తారు. ఆదాము, ఆదికాండం 3:15 లో చెప్పబడిన వాగ్ధానమునందు విశ్వాసముంచెను. స్త్రీని నుండి వచ్చిన బిడ్డ సాతానును ఏలును. ఆదాము ఆయనయందు విశ్వాసముంచెను. దృష్టాంతముగా కనపరచుటకు హవ్వ అని పేరు పెట్టెను (20). మరియు అయ్యన అంగీకారమునకు సూచనగా వారికి చర్మపు చొక్కాయిలను చేయించి వారికి తొడిగించెను (వ21). ఆ విషయానికి అంత వరకు ఆదాము ఎరుగును గాని అతడు దానిని నమ్మాడు.
అబ్రహాము వాగ్ధానప్రకారము దేవుని యందు విశ్వాసముంచెను మరియు నూతన ప్రత్యక్షతననుగ్రహించెను ఆదికాండం 12 మరియు 15 లో. మోషేకు ముందుగా, లేఖనాలు వ్రాయబడలేదుగాని మానవజాతి మాత్రము భాధ్యులు. వారికి దేవుడేదైతే ప్రత్యక్షపరచిన దానికి. పాతనిబంధన అంతట , విశ్వాసులందరు రక్షణానుభవములోనికి వచ్చారు. ఎందుకంటె వారు దేవునియందు నమ్మికయుంచారు. ఒక దినాన్న వారి పాపపుసమస్యను ఎవరో ఒకరు పటించుకుంటారని. ఈ దినాన్న, మానవులు వెనక్కి తిరిగి చూచినట్లయితే మన పాపముల నిమిత్తము ముందుగానే ఎప్పుడో భాధ్యత తీసుకున్నాడని ఆయనయందు విశ్వాసముంచటం (యోహాను 3:16; హెబ్రీయులకు 9:28).
యేసుక్రీస్తుదినాలలో ఆయన సిలువ, పునరుథ్ధానాలకు ముందు విశ్వసించిన వారి సంగతి ఏంటి? వారు యేసుక్రీస్తు సిలువపై వారి పాపముల నిమిత్తము మరణించుట వారు పూర్తిగా అవగాహనకిలిగియున్నారా? చివరిగా ఆయన సేవ పరిచర్యలో "అప్పటినుండి తాను యెరూషలేమునకు వెళ్ళి పెద్డలచేతను యాజకులచేతను శాస్త్రులచేతను అనేక హింసలుపొంది, చంపబడి, మూడవదినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియచేయ మొదలుపెట్టగా (మత్తయి 16:21-22). అయితే ఈ సమాచారానికి శిష్యులు ప్రతిచర్య ఏంటి? పేతురు ఆయన చేయి పట్టుకొని- ప్రభువా అది నీకు దూరమగును గాక, అది నీకెన్నడును కలుగదని గద్దింపసాగెను. పేతురు మరి ఇతర శిష్యులకు పూర్తి సత్యమేంటో తెలీదు. అయినా వారు రక్షింపబడరు ఎందుకంటె వారి పాపపుసమస్యను దేవుడు భాధ్యత వహిస్తాడని వారికి తెలియదు. యేసు ఏవిధంగా దీనిని నెరవేరుస్తాడో అని ఆదాము,అబ్రహాము, మోషే దావీదుకు తెలియదు ఏవిధంగా అని, గాని ఆయనయందు విశ్వాసముంచారు.
ఈదినాన్న యేసుక్రీస్తు పునరుత్ధానమునకు ముందు ప్రజలకున్న ప్రత్యక్షతకంటె ఇప్పుడు చాలావిధాలుగా ప్రత్యక్షపరచబడ్డాడు. మనకు పూర్తిగా తెలుసు " పూర్వాకాలమందు నానాసమయములలోను నానా విధాలుగాను ప్రవక్తలద్వారా మన పితరులతో మాటలాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారును ద్వారా మనతో మాటలాడెను. ఆయన ఆకుమారుని సమస్తమునకు వారసునిగా నియమించెను. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను" (హెబ్రీయులకు 1:1-2). మనరక్షణ ఇంకను యేసుక్రీస్తుమరణం మీద ఆధాపరపడింది. మన విశ్వాసము రక్షణకు కావాల్సినది. మన విశ్వాసానికి అంశం దేవుడు మాత్రమే. ఈ దినాన్న, మనకొరకు, మన విశ్వాసానికున్నా విషయానికి కర్త, యేసుక్రీస్తు మన పాపములనిమిత్తము సిలువపై మరణించి, చనిపోయి సమాధిచేయబడి, తిరిగి మూడవదినాన్న లేపబడుట (1 క్రింథీయులకు 15: 3-4).
ప్రశ్న: ప్రత్యామ్నాయ ప్రాయశ్చిత్తం అంటే ఏంటి?
సమాధానము:
ప్రత్యామ్నాయ ప్రాయశ్చిత్తం యేసుక్రీస్తు పాపులకు బదులుగా మరణించుట సూచిస్తుంది. లేక్ఝానాలు భోధిస్తున్నాయి మానవులందరు పాపులని (రోమా 3:9-18, 23).పాపమునకు శిక్ష మరణము. రోమా 6:23 చదివినట్లయితే "ఏలయనగా పాపమువలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తుయేసునందు నిత్యజీవము."
ఈ వచనం చాల విషయాలు మనకు భోధిస్తుంది. క్రీస్తులేకుండా, మనము చనిపోయినట్లయితే నరకములో నిత్యత్వాన్ని గడపాలి. ఎందుకంటే పాపమునకు వెల కాబాట్టి. లేఖనాలలో మరణము "వేరుపరచబడటం" ను సూచిస్తుంది. ప్రతీ ఒక్కరూ చనిపోతారు, అయితే కొందరు నిత్యత్వములో దేవునితో పరలోకములోనుంటారు. మరికొంతమంది నిత్యత్వం నరకములోనే జీవిస్తారు. ఇక్కడ చెప్పబడిన మరణం అది నరకములో జీవించే దాని గురుంచి సూచిస్తుంది. ఏదిఏమైనా, రెండవ విషయం ఈ వచనభాగం భోధిస్తుంది, నిత్యజీవం కేవలం యేసుక్రీస్తు ద్వారానే లభించును. ఇదే ఆయన ప్రత్యామ్నాయ ప్రాయశ్చిత్తం.
యేసుక్రీస్తు సిలువ వేయబడినపుడు ఆయన మనకు బదులుగా మరణించాడు. మనము ఆరీతి మరణము, సిలువమీద చనిపోవటానికి యోగ్యులము ఎందుకంటె మనమే పాపపూరితమైన జీవితం జీవిస్తున్నాము కాబట్టి. అయితే క్రీస్తు ఆపాప శిక్షను ఆయన తనపై మనకు బదులుగా వేసుకున్నాడు- తనకు తానే మనకు ప్రత్యమ్నాయం ఆయనే మనము ధర్మముగా యోగ్యులమైన దానికి ఆయనపై తీసుకున్నాడు " ఎందుకనగా మనమాయనయందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మనకోసము పాపముగా చేసెను" (2 కొరింథీ 5:21).
"మనము పాపముల విషయమై చనిపోయి, నీతివిషయమై జీవించునట్లు, ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రానుమీద మోసికొనెను" (2 పేతురు 2:24)- ఇక్కడ మరలా మనము చూస్తున్నాం. క్రీస్తు మనము చేసిన పాపాలను ఆయనపై వేసుకొని, ఆపాపములకు తనకు తానే వెలచెల్లించటానికి. కొన్ని వచనాల తర్వాత మనం చదువుతాం "ఏలయనగా మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు , అనీతిమంతులకొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీరములో చంపబడియు , ఆత్మ విషయములో బ్రదికింపబడి, పాపముల విషయములో ఒక్కసారే శ్రమపడెను" (1 పేతురు 3:18). ఈ వచనాలు మాత్రమే క్రీస్తు మనకొరకు చేసిన ప్రత్యామ్నాయం గురుంచి భోధించుటలేదుగాని ఆయన ఒక్కసారే ప్రాయశ్చిత్తం లేక పరిహారం చెల్లించారనికూడా భోధిస్తున్నది. దాని అర్థం పాపభురితమైన మానవపాపానికి వెల చెల్లించి దానిని సంతృప్త్జిచేసాడు.
మరొక పాఠ్యభాగము ఆ ప్రత్యామ్నాయ ప్రాయశ్చిత్తం గురుంచి ప్రస్తావిస్తుంది యెషయా 53:5. ఈ వచనం మన పాపాముల నిమిత్తమై సిలువపై చనిపోవాల్సిన క్రీస్తు మొదటి రాకడ విషయమై ఉచ్చరిస్తుంది. ప్రవచనాలు చాలా వివరంగా ఉన్నవి. మరియు సిలువపై చంపివేయబడటం ముందుగానే జరిగినవి. "మన యతిక్రమక్రియలను బట్టి అతడు గాయపరచబడెను. మన దోషములనుబట్టి నలుగగొట్టబడెను. మన సమాధానార్ధమైన శిక్ష అతనిమీద పడెను. అతడు పొందిన దెబ్బలచేత మనకు స్వస్థత కలుగుచున్నది." ప్రత్యామ్నాయాన్ని” గుర్తించండి. ఇక్కడ మరలా క్రీస్తు మన పాపంకై వెల చెల్లించుట చూస్తూన్నాం.
మనం మన పాపములనిమిత్తమై మనమే శిక్షనొంది వెలచెల్లించుటవలన మరియు నిత్యత్వం అనే నరకములో జీవించుటవలన వెల చెల్లించవచ్చు. గాని దేవుని కుమారుడు యేసుక్రీస్తు, ఈ భూమిమీదకు కేవలం మన పాపాలకు చెల్లించాల్సిన వెల చెల్లించటానికి వచ్చాడు. ఎందుకంటె ఇది మనకొరకు ఆయన చేశాడు. ఇప్పుడు మనకు ఒక తరుణం ఇవ్వబడింది, అది ఆయన మన పాపములను క్షమించుటయే కాదు గాని, నిత్యత్వమూ ఆయనతోనే గడపటానికి కూడ ఇచ్చాడు. ఈ విధంగా చేయటానికి మనము యేసు సిలువపై చేసిన క్రియయందు విశ్వాసముంచడమే. మనలను మనం రక్షించుకోలేం. మనకు, మన బదులు మన స్థలం తీసుకోవడానికి ప్రత్యామ్నాయం కావాలి. యేసుక్రీస్తు మరణమే మనకు ప్రత్యామ్నాయ ప్రాయశ్చిత్తం.
ప్రశ్న: దేవుని సార్వభౌమత్వము మన స్వచిత్తం రెండు కలిసి రక్షణ కార్యములో ఏ విధంగా పనిచేయును?
సమాధానము:
దేవుని సార్వభౌమత్వం, మానవుల స్వచిత్తం వాటి మధ్య సంభంధాన్ని మరియు భాద్యతను పూర్తిగా అవగాహనను చేసికోవటం అసాధ్యం. కేవలం దేవునికి ఒక్కరికి మాత్రమే రక్షణ ప్రణాళిక అది ఏ విధంగా కలిసి పనిచేయునో తెలియును. సుమారు మిగిలిన సిధ్ధాంతాలతో, ఈ సంధర్భంను పోల్చినట్లయితే ఆయనతో కలిగియుండే సంభంధంగురుంచి గాని దేవుని స్వభావమునుగూర్చి గాని మనము పూర్తిగా గ్రహించటానికి మన చేతగానితనంను ఒప్పుకొనవలెను. ఇరుప్రక్కల మనము దూరంగా ఆలోచించుటకు ప్రయత్నించినట్లయితే పూర్తిగా రక్షణనుగూర్చి అవగాహన చెదురుమదురు అవుతుంది.
లేఖానాలు చెప్తున్నాయి దేవునికి తెలుసు ఎవరు రక్షణపొందాలి అని (రోమా 8:29; 1 పేతురు 1:2). ఎఫెసీ 1:4 లో "జగత్తు పునాది వేయబడకముందే" ఆయన మనలను ఏర్పరచుకొనెను. బైబిలు పలుమార్లు చెప్తుంది విశ్వాసులు ఏర్పరచుకొనబడినవారు (రోమా 8:33; 11:5; ఎఫెసీ 1:11; కొలస్సీయులకు 3:12; 1 థెస్సలోనీయులకు 1:4; 1 పేతురు 1:2; 2:9) మరియు “ఎన్నుకొనబడినవారు” (మత్తయి 24:22, 31; మార్కు 13:20, 27; రోమా 11:7; 1 తిమోతి 5:21; 2 తిమోతి 2:10; తీతుకు 1:1; 1 పేతురు 1:1). విశ్వాసులు ముందుగా నిర్ణయించబడినవారు (రోమా 8:29-30; ఎఫెసీయులకు 1:5, 11), మరియు మీ పిలుపును ఏర్పాటు చేయబడినవారు(రోమా 9:11; 11:28; 2పేతురు 1:10), రక్షణ కొరకే అని స్పష్టముగా తెలుస్తుంది.
లేఖనాలు చెప్తున్నాయి యేసుక్రీస్తును రక్షకుడుగా అంగీకరించినందుకు మనము భాధ్యతకలిగియున్నాము - మనము చేయవలసినదంతా యేసునందు విశ్వాసముంచినట్లయితే రక్షింపబడతావు (యోహాను 3:16; రోమా10:9-10). దేవునికి తెలుసు ఎవరైతే రక్షణపొందాలో, మరియు దేవుడు ఎన్నుకున్నాడు ఎవరైతే రక్షణపొందాలో గనుక రక్షింపబడుటకుగాను మనం క్రీస్తును ఎన్నిక చేసుకోవాలి. ఈ మూడు వాస్తవాలు ఏ విధంగా కలిసి పనిచేస్తాయో పరిథులు కలిగిన మానవుడు అర్థం గ్రహించటానికి అసాధ్యమైంది(రోమా 11:33-36). మన భాధ్యత ఏంటంటే ఈ యావత్తు ప్రపంచానికి సువార్తను తీసుకు వెళ్ళటమే (మత్తయి 28:18-20; అపోస్తలుల కార్యములు 1:8). మనము ముందుగా తెలుసుకోవడం, ఎన్నుకోబడటం, నిర్ణయించబడటం అనేవి దేవునికి సంభంధించిన విషయాలను విడచి నీవు నిష్కపటముగా దేవుని సువార్తను ఇతరులకు పంచుతూ విధేయత చూపించవలెను.
ప్రశ్న: రక్షణ నిశ్చయతను నేను ఏలాగు కలిగియుండగలను?
సమాధానము:
నీవు రక్షణ పొందిన విషయాన్ని ఖచ్చితముగా ఎలాగు తెలిసికోగలవు? 1యోహాను 5:11-13 ను ఆలోచించు " ఆ సాక్ష్యమేమనగా- దేవుడు మనకు నిత్యజీవమును దయచేసెను; ఈ జీవము ఆయన కుమారునియందున్నది. దేవుని కుమారుని అంగీకరించువాడు జీవముగలవాడు; దేవుని కుమారుని అంగీకరింపనివాడు జీవములేనివాడే. దేవుని కుమారుని నామమందు విశ్వాసముంచు మీరు నిత్యజీవముగలవారని తెలిసికొనునట్లు నేను ఈ సంగతులను మీకు వ్రాయుచున్నాను."కుమారునియందున్నది ఎవరు? వారు, అంటే ఆయనయందు విశ్వాసముంచి, అంగీకరించినవారు (యోహాను 1:12). నీలో యేసు ఉన్నట్లయితే నీలో జీవమున్నట్లే. తాత్కాలికమైన జీవం కాదు గాని శాశ్వతమైనది.
దేవుడు మననుండి కోరుకొనేది మన రక్షణ పట్ల నిశ్చయత కలిగియుండాలని. మనము నిజంగా రక్షింపబడ్డమాలేదా అంటూ అశ్చర్యపోతూ, లేక విచారిస్తూ క్రైస్తవ జీవితాన్ని జీవించలేం. అందుకే బైబిలు రక్షణ ప్రణాళికను చాల స్పష్టముగా వివరిస్తుంది. యేసుక్రీస్తు నందు విశ్వాసముంచుము అప్పుడు నీవు రక్షింపబడుదువు ( యోహాను 3:16; అపొస్తలుల కార్యములు 16:31). మన పాపములకొరకై ప్రాయశ్చిత్తముగా వెలచెల్లించాడని మన నిమిత్తమై ఆయన మరణించాడని, రక్షకుడని నీవు యేసునందు విశ్వాసమును చూపగలవా ( రోమా 5:8; 2కొరింథి 5:21)? నీ రక్షణకొరకు ఆయనయందు మాత్రమే నమ్మికయుంచుతున్నావా? నీ జవాబు అవును అని అన్నట్లయితే నీవు రక్షిణపొందినావు. నిశ్చయత అనగా "అనుమానాన్ని అధిగమించి నీవునమ్మటం." నీ హృదయం దేవుని వాక్యానికి కేంద్రమయితే "అనుమానాన్ని అధిగమించి" నీవు నిత్య రక్షణ గూర్చిన సత్యాన్ని, వాస్తవాలను నమ్ముతావు.
యేసు తన్ను తానే ఆయనయందు ఎవరైతే విశ్వాసముంచుతారో వారి విషయమై ధృఢపరుస్తున్నాడు "నేను వాటికి నిత్యజీవము నిచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికిని నశింపవు, ఎవడును వాటిని నా చేతిలోనుండి అపహరింపడు. వాటిని నాకిచ్చిన నా తండ్రి అందరికంటె గొప్పవాడు గనుక నా తండ్రి చేతిలోనుండి యెవడును వాటిని అపహరింపలేడు"( యోహాను 10:28-29). నిత్యజీవము అంటే అది ఎన్నడూ -నిత్యమే. యేసుక్రిస్తు ఉచితముగా యిచ్చిన రక్షణా కృపావరమును, నీవుగాని మరి యింకెవరును నీయొద్దనుండి తీసివేయలేరు.
వాక్యమును మన హృదయములో ఉంచుకొనుట ద్వారా ఆయనకు వ్యతిరేకముగా పాపము చేయలేము (కీర్తనలు 119:11)ఇది పాపమునుగూర్చిన అనుమానాన్ని నివృత్తిచేయును. దేవుని వాక్యము నీకు ఏదైతే భోధిస్తుందో దానిని యందు నీవు సంతోషించు అప్పుడు నీవు అనుమానించుటకు బదులు భరోసా కలిగి జీవించగలవు. క్రీస్తు సొంతమాటల ఆధారంగా మనము నిశ్చయత కలిగి మన రక్షణ ఎన్నటికి ప్రశ్నార్థకం కాదు. మన నిశ్చయత దేవుని ప్రేమ యేసుక్రీస్తు ద్వార మనకు వెల్లడి అగుటపై ఆధారపడివుంది.
ప్రశ్న: నిత్య భధ్రత పాపము చేయడానికి అనుమతిని ధృవీకరిస్తుందా?
సమాధానము:
నిత్య భధ్రత సిధ్దాంతమునకు తరచుగా వచ్చే ఆక్షేపణ ఏంటంటే ఒక వ్యక్తి తన కిష్టమువచ్చినట్లు పాపం చేసి మరియు రక్షింపబడటుకు ప్రజలకు అనుమతినిచ్చినట్లు కన్పడుతుంది. సాంకేతికంగా ఆలోచించినట్లయితే ఇది సత్యమే, వాస్తవికంగా అది సత్యం కాదు. ఒక వ్యక్తి నిజంగా యేసుక్రీస్తుచేత విమోచింపబడినట్లయితే ఆ వ్యక్తి తన ఇష్ట్టనుసారంగా పాపభూయిష్టమైనా జీవితం జీవించుటలో కొనసాగడు. ఒక క్రైస్తవుడు ఏ విధంగా జీవించాలి మరియు ఆ వ్యక్తి రక్షణను పొందుటకుగాను ఏమిచేయవలెనో, మనము వీటిమధ్య భేధమును గ్రహించియుండాలి.
బైబిలు గ్రంధమయితే చాల స్పష్టముగా చెప్తుంది రక్షణ కృపవలనే, కేవలం విశ్వాసము వలనే, యేసుక్రీస్తువలనే (యొహాను 3:16). ఒక వ్యక్తి నిక్కర్చిగా యేసుక్రీస్తునందు విశ్వాసముంచిన క్షణములోనే అతడు లేక ఆమె రక్షింపబడి, ఆ రక్షణలో భద్రపరచబడియుంటారు. రక్షణ విశ్వాసమువలనే పొందుకొనుట ద్వారానే కాదు గాని, వాటితో క్రియలు కూడ చేస్తూ ఆ విశ్వాసమును కాపాడుకుంటారు ద్వార. అపోస్తలుడైన పౌలు ఈ విషయమును గలతీ 3:3 లో సంభోధించాడు. ఒకడు అడిగినప్పుడు " మీరింత అవివేకులైతిరా? మొదట ఆత్మానుసారముగా ఆరంభించి, యిప్పుడు శరీరానుసారముగా పరిపూర్ణులగుదురా?" ఒకవేళ విశ్వాసమువలనే రక్షింపబడినట్లయితే మన రక్షణకూడ విశ్వాసముచేత భద్రపరచబడి కొనసాగబడుతూ వుండాలి. మన రక్షణను మనము సంపాదించుకొనలేము. అందునుబట్టి, మన రక్షణను కొనసాగించే స్థోమతను కూడ సంపాదించుకొనలేం. అది దేవుడు మాత్రమే మన రక్షణను కొనసాగిస్తాడు (యూదా 24). గనుక దేవునిచేతిలోనుండి మనలను ఎవరూ అపహరింపకుండా గట్టిగా పట్టుకొనును (యొహాను 10:28-29). అదే దేవుని ప్రేమ దానినుండి మనలను ఎవరునూ వేరుచేయలేరు(రోమా 8:38-39).
ఎటువంటి నిత్య భధ్రతనైనా ఉల్లఘించినట్లయితే , దాని తత్వములో ఒకనమ్మిక ఏంటంటే మన సొంత రక్షణను మంచిపనులద్వారా ప్రయత్నముల ద్వారా కొనసాగించాలనేది , ఇది పూర్తిగా కృపవలనే రక్షణ అనేదానికి విరుద్దమైనది. మనము రక్షింపబడ్డాము ఎందుకంటే క్రీస్తు అర్హమైన పాత్రాగా గాని మన సొంతగా కాదు (రోమా 4:3-8). అది మనది, అని హక్కును బహిర్గంగ చెప్పాలంటే దేవుని వాక్యమునకు విధేయత చూపించాలి లేక దేవుని మార్గాలలో నడిపించబడి రక్షణను కొనసాగిస్తూన్నాము అంటే మనము చెప్తునది యేసుక్రీస్తు నాపాపములకై చెల్లించిన వెల చాలదు. యేసుక్రీస్తు మరణమొందుట ద్వారా మన పాపములకై సంపూర్తిగా తగినరీతిలో వెల చెల్లించాడు- వర్తమాన, భూత, భవిష్యాత్కాలములకు , రక్షణముందు మరియు రక్షణ తర్వాత (రోమా 5:8; 1కొరింథీయులకు 15:3; 2 కొరింథీయులకు 5:21).
అయితే ఇది ఒక క్రైస్తవునికి తన తన కిష్టమువచ్చినట్లు పాపం చేసి మరియు రక్షింపబడటమా అని అర్థమిస్తుందా? ఇది కేవలం ప్రాధాన్యమైన ఊహాజనికమైన ప్రశ్నయే. ఎందుకంటే బైబిలు చాల స్పష్టంగా చెప్తుంది ఒక క్రైస్తవుడు "తన కిష్టమొచ్చినట్లు" జీవించడానికి వీలులేదు అని. క్రైస్తవులు నూతన సృష్టి ( 2 కొరింథీయులకు 5:17). క్రైస్తవులు ఆత్మీయవరాలను ప్రత్యక్షంగా ప్రదర్శిస్తారు (గలతీయులకు 5:22-23) గాని శరీరానుసారమైనవి కావు (గలతీయులకు 5:19-21). మొదటి యోహాను 3:6-9 స్పష్టముగా చెప్తుంది క్రైస్తవుడు పాపములో కొనసాగుతూ జీవించలేడు. ఈ నిందకు ఉత్తర్వుగా కృప పాపముచేయుటకు అనుమతిస్తుందని, అందుకే అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు " ఆలాగైన ఏమందుము? కృపవిస్తరింపవలెనని పాపమందు నిలిచియుందుమా? అట్లనరాదు. పాపము విషయమై చనిపోయిన మనము ఇకమీదట ఏలాగు దానిలో జీవించుదుము?" (రోమా 6:1-2).
నిత్య భధ్రత అనేది పాపము చేయటానికి అర్హతను ధృవీకరించుట కాదు. దానికన్నా, భధ్రత అంటే దేవునిని ఎరిగినందుకు, ఎవరతే క్రీస్తునందు విశ్వాసముంచుతారో వారికి దేవుని ప్రేమ పొందుటకు అభయమిస్తుంది. దేవుడిచ్చిన అధ్భుతమైన రక్షణ అనే వరాన్ని ఎరిగి దాని గ్రహించి పాపముచేయటానికి విరుధ్దముగా అర్హతను దృవీకరాన్ని సాధించటమే. యేసుక్రీస్తు మనపాపాలకు వెల చెల్లించాడనే సత్యాన్ని ఎరిగి పాపములో జీవిస్తూ ఎవరైనా ఏవిధంగానైనా పాపములో కొనసాగగలరు (రోమా 6:15-23)? దేవుని షరతులులేని ప్రేమను మరియు అభయమిచ్చే ప్రేమను విశ్వసించినవారికి అనుగ్రహించి ప్రేమను పొందుకొని ఎవరైనా ఏవిధంగానైనా దేవుని ముఖంవెనుకకు త్రిప్పికొట్టగలరు? అటువంటి వ్యక్తి నిత్య భధ్రతను పాపముచేయటానికి అర్హతను ధృవీకరించినదని ప్రదర్శించుట లేదుగాని, అతడు లేక ఆమే తప్పనిసరిగా యేసుక్రీస్తు ఇచ్చిన రక్షణానుభవములో కలిగిలేరు అనేది విశదమవుతుంది " ఆయనయందు నిలిచియుండువాడెవడును పాపము చేయడు; పాపముచేయువాడెవడును ఆయనను చూడనులేదు ఎరుగనులేదు"(1 యోహాను 3:6).